కాస్టింగ్ కౌచ్ పై అందరూ నోరు విప్పాలంటోంది


actress pooja kumar opens up on casting couch

కాస్టింగ్ కౌచ్ భూతం సినిమా రంగాన్ని పట్టి పీడిస్తోందని అందుకే అందరు కూడా ఆ విషయం లో ఎదుర్కొన్న ఇబ్బందులను బయటి ప్రపంచానికి తెలిసేలా నోరు విప్పాలని అప్పుడే దాన్ని అరికట్టడానికి తగిన చర్యలు తీసుకుంటారని అంటోంది 41 ఏళ్ల పూజా కుమార్ . తెలుగు , తమిళ్ , హిందీ చిత్రాల్లో నటించిన ఈ ముదురు భామకు కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు మాత్రం ఎదురు కాలేదని అంటోంది . అవకాశాల కోసం ఎవడి పక్కలోనో పడుకోవాల్సిన అవసరం లేదని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని హితబోధ చేస్తోంది పూజా కుమార్ .

కమల్ హాసన్ సరసన విశ్వరూపం చిత్రంలో నటించింది ఈ భామ అలాగే త్వరలో విడుదల కానున్న విశ్వరూపం 2 లో కూడా నటించింది . కమల్ తోనే మూడు సినిమాల్లో నటించిన పూజా కుమార్ తెలుగులో డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన ” పీఎస్ వి గరుడ వేగ ” చిత్రంలో నటించింది . అమెరికాలో స్థిరపడిన ఈ భామ అక్కడ కూడా పలు టివి షోలలో నటించింది . కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు గతకొంత కాలంగా సినిమా రంగాన్ని ఇబ్బంది పెడుతున్నాయి . దాంతో పూజా కుమార్ స్పందించింది అంతేకాదు ఆ …… ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొన్నారో వాళ్ళు ముందుకు వచ్చి చెబితే ఇక్కడ జరిగేది అందరికీ అర్ధం అవుతుంది అప్పుడు చర్యలు తీసుకోవచ్చు అని అభిప్రాయపడుతోంది .

English Title: actress pooja kumar opens up on casting couch