కాస్టింగ్ కౌచ్ నిజమే అంటున్న సీనియర్ నటి


టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఇప్పుడున్నది కాదని ముందు నుండి ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది సీనియర్ నటి రాధాప్రశాంతి. ఎంతోమంది ప్రతిభ కలిగిన నటీనటులు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు అయితే తెలుగు వాళ్ళని కాకుండా ఇతర అన్ని రకాల పాత్రలకు పరభాషా నటీనటులను తీసుకువస్తున్నారు. ఇక మహిళల విషయంలో ఈ ధోరణి ఎక్కువగా ఉంది అందుకు కారణం కాస్టింగ్ కౌచ్ అంటూ అసలు విషయాన్ని బయటపెట్టింది రాధాప్రశాంతి .

90 వ దశకంలో పలు తెలుగు చిత్రాల్లో నటించింది రాధాప్రశాంతి . వ్యాంప్ పాత్రలను , క్యారెక్టర్ ఆర్టిస్టు గా పలు చిత్రాల్లో నటించిన ఈ భామకు తెలుగు దర్శకుల నుండి సరైన ప్రోత్సాహం లభించలేదని ఇప్పటికైనా టాలెంట్ ఉన్న తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయాలని అంటోంది. పరభాష నటీమణులు వాళ్లకు సహకరిస్తున్నారు కాబట్టే వాళ్లకు పాత్రలు వస్తున్నాయని ఆరోపిస్తోంది రాధాప్రశాంతి. శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన తర్వాత ఈ ఆరోపణలు ఎక్కువగా చేస్తున్నారు పలువురు నటీమణులు.