తొడలు ఉన్నాయి కాబట్టే చూపిస్తున్నాను : రష్మీ


rashmi sensational comments on her thighs

తొడలు ఉన్నాయి కాబట్టే చూపిస్తున్నాను అందులో తప్పేముందని అంటోంది హాట్ భామ రష్మీ . జబర్దస్త్ తో తెగ ఫేమస్ అయిన ఈ భామ అంతకంటే ముందే సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది కానీ అప్పుడు ఈ భామని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కట్ చేస్తే ….. జబర్దస్త్ లో రెచ్చిపోయి అందాలను ఆరబోసేసరికి రష్మీ కి ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది . ఇంకేముంది రష్మీ ని హీరోయిన్ గా పెట్టి గ్లామర్ చిత్రాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు .

ఇప్పటికే గుంటూరు టాకీస్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టినప్పటికీ పాపం రష్మీ కి ఆ తర్వాత అంతగా కలిసి రాలేదు . ఎన్ని సినిమాలు చేసినా అవి ప్లాప్ అవుతూనే ఉన్నాయి . తాజాగా అంతకుమించి అనే రొమాంటిక్ , హర్రర్ ఫిలిం చేస్తోంది . ఇక ఆ సినిమాలో రెచ్చిపోయి అందాలను ఆరబోయడమే కాకుండా ఘాటు లిప్ లాక్ లు కౌగిలింతల సన్నివేశాల్లో నటించింది . ఇక రష్మీ తొడలు ఎక్స్ పోజ్ అయ్యే స్టిల్ తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది అంతేకాదు ఆర్ ఎక్స్ 100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి కూడా రష్మీ తొడలపై కామెంట్ చేసాడంటే ఆ పోస్టర్ ఏ రేంజ్ లో ఆకట్టుకుందో అర్ధం చేసుకోవచ్చు . తన తొడల గురించి రకరకాల కామెంట్స్ వినబడుతుండటంతో రష్మీ స్పందించింది అయితే సింపుల్ గా తొడలు ఉన్నాయి కాబట్టి చూపించాను అందులో తప్పేముందని .

English Title: actress rashmi sensational comments on her thighs