మహేష్ ని అవమానించిన సాయి పల్లవి


Actress Sai Pallavi insults Mahesh Babu

మహేష్ బాబు సినిమాలో నటించే ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోరు కానీ పిలిచి మరీ మహేష్ సినిమాలో ఛాన్స్ ఇస్తే మాత్రం సాయి పల్లవి నేను నటించను అంటూ రిజెక్ట్ చేసి సంచలనం సృష్టించింది . మహేష్ బాబు సినిమాలో నటించాలని ఆశగా ఎదురు చూసే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. కానీ సాయి పల్లవి కి ఆ ఛాన్స్ వస్తే మాత్రం నా క్యారెక్టర్ కు అంతగా ప్రాధాన్యత లేదు కాబట్టి మహేష్ తో నటించను అంటూ అవమానించింది .

 

ఈ సంచలన సంఘటన తాజాగా జరిగింది . ఎఫ్ 2 సంచలన విజయం సాధించిన తర్వాత మహేష్ బాబు తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు అనిల్ రావిపూడి . మహేష్ పక్కన సాయి పల్లవి అయితే బాగుంటుంది అని దిల్ రాజు సూచించడంతో ఆమెని కలిశాడట అనిల్ కానీ హీరో వెంట పడే క్యారెక్టర్ నేను చేయను అంటూ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంది సాయి పల్లవి . గత ఏడాది ఈ భామ నటించిన పడిపడిలేచె మనసు చిత్రంలో నటించింది , అయితే ఆ సినిమా ఘోర పరాజయం పొందింది .