యంగ్ హీరో ని రిజెక్ట్ చేసిన సాయి పల్లవి

Actress Sai Pallavi rejects Bellamkonda Sai Srinivasవివాదాస్పద నటి సాయి పల్లవి యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని రిజెక్ట్ చేసింది , ఇప్పటికే పలువురు హీరోలతో ఈ భామకు అంతగా పొసగడం లేదు అయినప్పటికీ ఈ భామ డేట్స్ కోసం పలువురు హీరోలు దర్శక నిర్మాతలు పోటీ పడుతూనే ఉన్నారు . తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించనున్న చిత్రంలో సాయి పల్లవి నటించడానికి సుముఖత చూపింది కానీ కథ నచ్చలేదో లేక ప్లాప్ హీరో అనే కారణమో కానీ 2 కోట్ల ఆఫర్ ఇచ్చినప్పటికీ బెల్లంకొండ పక్కన నటించడానికి నిరాకరించింది . సాయి శ్రీనివాస్ తో రొమాన్స్ చేస్తే 2 కోట్ల ఆఫర్ ఇస్తామని చెప్పినప్పటికీ ఆ అఫర్ ని తిరస్కరించడంతో చిత్ర యూనిట్ మరో హీరోయిన్ కోసం అన్వేషణ సాగిస్తోంది .

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పటివరకు చేసిన నాలుగు చిత్రాలు ప్లాప్ ! అయితే గుడ్డిలో మెల్ల లాగా లాంచింగ్ సినిమా అయిన ” అల్లుడు శీను ” కొంత బెటర్ ఎందుకంటే పరిచయమైన ఆ సినిమాతో మంచి మార్కులే కొట్టాడు అలాగే భారీ వసూళ్లు వచ్చాయి కూడా కానీ ఎటొచ్చి అత్యధికంగా ఖర్చు పెట్టారు కాబట్టి కొంత లాస్ అంతే ! ఇక మిగతా సినిమాలన్నీ ఘోర పరాజయం పొందాయి . స్పీడున్నోడు , జయ జానకి నాయక , ఇక ఇప్పుడేమో సాక్ష్యం దాంతో సాయి పల్లవి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని రిజెక్ట్ చేసింది .

English Title: Actress Sai Pallavi rejects Bellamkonda Sai Srinivas