
ఒకరి స్టైల్‌ని ఫాలో కావడం వేరు ఒకరిని అనుకరించడం వేరు. ఇవి రెండే కాకుండా మరోలా చేస్తే ఖచ్చింతగా అది వారిని కాపీ కొట్టడమే అవుతుంది. అచ్చు ఇలాంటి పనే క్రేజీ కథానాయిక సమంత చేసి అడ్డంగా బుక్కైంది. గత కొంత కాలంగా నటనకు ప్రాధాన్యత వున్న చిత్రాల్లో మాత్రమే నటిస్తూ వస్తోంది సమంత. ఇటీవల ఆమె నటించిన మజిలీ, యూటర్న్, ఓ బేబీ తాజాగా `జాను` చిత్రాలు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి.
సినిమాల్లో కొత్త దనాన్ని కోరుకుంటున్న సమంత ఫ్యాషన్ పరంగానూ ఎప్పటి కప్పుడు కొత్త తరహా డిజైన్స్‌ని లైక్ చేస్తూ వాటిని ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటోంది. కొన్ని డిజైన్స్ ఔరా అని పిస్తే కొన్ని మాత్రం కాపీగా తెలిసిపోతున్నాయి. తాజాగా సామ్ అలాంటి ఓ డిజైనర్ సారీని డిజైన్ చేయించుకుని అడ్డంగా దొరికిపోయింది. తమిళ హిట్ చిత్రం `96` ఆధారంగా తెలుగులో రీమేక్ అయిన చిత్రం `జాను`. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో సమంత నటించింది. ఇటీవలే ఈ చిత్రం విడుదలై మంచి టాక్ని సొంతం చేసుకుంది. దీంతో సెలబ్రేషన్ మూడ్‌లోకి వెళ్లిపోయిన సామ్ `జాను` పేకుని పింక్ కలర్ సారీపై డిజైన్ చేయించుకుని సక్సెస్ మీట్లో పాల్గొంది.
అయితే సమంత ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న సారీని గతంలో బాలీవుడ్ భామ కరీనా కపూర్ తన పేరు బిబో అని డిఐన్ చేయించుకుని ధరించింది. అచ్చు అదే ఐడియాని సామ్ కాపీ కొట్టి కొత్త డిజైన్‌గా కలరింగ్ ఇవ్వడంతో నెటిజన్స్ సామ్ కూడా కాపీ క్యాటే అంటూ ట్రోల్ చేస్తున్నారు.