సమంత ప్రెగ్నెన్సీ తో లేదట


actress samantha reacts on pregnensy rumoursనాగచైతన్య ని పెళ్లి చేసుకున్న సమంత నెల తప్పిందని గుసగుసలు మొదలు కావడం అవి సమంత చెవిన పడటంతో పక్కున నవ్వుతోంది సామ్ ఎందుకంటే నేను కడుపుతో ఉన్నాను అని వస్తున్న వన్నీ గాలి వార్తలే అని తేల్చి చెప్పింది అంతేకాదు ఇప్పట్లో తల్లి అయ్యే ఆలోచనే లేదు ….. నేను చైతూ ముందుగానే ఓ అవగాహన కు వచ్చాం ఎప్పుడు పిల్లల్ని కనాలి ఎలా పెంచాలి అనేది అంటూ సెలవిచ్చింది సమంత .

ఇటీవలే నెలరోజుల పాటు ఏకాంత సేవలో గడిపి వచ్చారు నాగచైతన్య – సమంత లు . ఇక సమంత నటించిన రంగస్థలం చిత్రం పాత రికార్డులను బద్దలు కొడుతూ భారీ వసూళ్ల ని సాధిస్తోంది . చరణ్ తో పాటుగా సమంత నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి దాంతో ఈ భామ చాలా సంతోషంగా ఉంది . రంగస్థలం తో ఆకట్టుకున్న సమంత త్వరలోనే మహానటి చిత్రంతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానుంది .