పండంటి పాప‌కు జ‌న్మ‌నిచ్చిన హీరోయిన్‌!Actress Sneha blessed with baby girl
Actress Sneha blessed with baby girl

తెలుగు, త‌మిళ భాష‌ల్లో క‌థానాయిక‌గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు స్నేహ‌. వ‌రుస సినిమాల‌తో బిజీగా వున్న స‌మ‌యంలోనే త‌మిళ హీరో ప్ర‌స‌న్నతో ప్రేమ‌లోప‌డిన స్నేహ ఇరు కుటుంబాల అంగీకారంతో ఆయ‌న్నే వివాహం చేసుకుంది. పెళ్లి త‌రువాత కూడా సినిమాల్లో న‌టిస్తూ త‌ను మాత్ర‌మే చేయ‌ద‌గ్గ పాత్ర‌ల్లో న‌టిస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ఇటీవ‌ల ధ‌నుష్ న‌టించిన `ప‌ట్టాస్‌` చిత్రంలో ఓ హీరోయిన్‌గా స్నేహ   న‌టించింది.

ఈ సినిమా ఇటీవ‌లే విడుద‌లైంది కూడా. తొలిసారి బాబుకు జ‌న్మనిచ్చిన స్నేహ ఈ రోజు పండంటి పాప‌కి జ‌న్మ‌నిచ్చారు. ఈ విష‌యాన్ని స్నేహ భ‌ర్త, హీరో ప్ర‌స‌న్న సోష‌ల్ మీడియా ఇన్‌స్టా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. `ఏంజిల్ వ‌చ్చేసింది` అని చిన్నారికి సంబంధించిన పింక్ క‌ల‌ర్‌ షూస్ ఫొటోని పోస్ట్  చేయ‌డం ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది.

ప్ర‌స‌న్న‌, స్నేహ‌ల‌కు 2009లో వివాహం జ‌రిగింది. ఆ త‌రువాత 2012 మే 11న వారికి తొలిసారి బాబు పుట్టాడు. ఆ త‌రువాతే మ‌ళ్లీ స్నేహ సినిమాల్లో న‌టించ‌డం మొద‌లుపెట్టింది. గ‌త కొన్ని నెలులుగా సినిమాల‌కు మ‌ళ్లీ దూరంగా వున్న ఆమె పాప పుట్టిన త‌రువాత మ‌ళ్లీ న‌ట‌న‌ని కొన‌సాగిస్తుందో లేదో చూడాలి.