రేణు దేశాయ్ రెండో పెళ్లి పై శ్రీ రెడ్డి కామెంట్


 actress Sri Reddy comments on Renu Desai engagement

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా రెండో పెళ్లి కి సిద్దమైన విషయం తెలిసిందే . వివాహ నిశ్చితార్థం కూడా జరగడంతో రేణు దేశాయ్ ని అభినందించే వాళ్ళు కొందరు అలాగే విమర్శించే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు . రేణు దేశాయ్ జీవితం ఎండమావి కాకుండా సంసార జీవితం సాఫీగా సాగిపోవాలని శుభాకాంక్షలు అందజేస్తున్న వాళ్ళ లో వివాదాస్పద నటి శ్రీ రెడ్డి కూడా ఉండటం గమనార్హం . తాజాగా ఈ భామ రేణు దేశాయ్ కి శుభాకాంక్షలు అందజేసింది దాంతో వైరల్ గా మారింది .

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పులేనపుడు రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటే తప్పేముంది అని అంటున్నారు చాలామంది నెటిజన్లు , అలాగే శ్రీ రెడ్డి ఉద్దేశం కూడా . పవన్ కళ్యాణ్ తో రేణు సహజీవనం చేసింది తర్వాత పెళ్లి చేసుకుంది కానీ మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు . పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే శ్రీ రెడ్డి రేణు దేశాయ్ విషయంలో జోక్యం చేసుకోవడం అంటే పవన్ కళ్యాణ్ ని సవాల్ చేయడమే !

English Title:  actress Sri Reddy comments on Renu Desai engagement

actress Sri Reddy comments on Renu Desai engagement