ఛాన్స్ ఇమ్మంటే పక్కలోకి రమ్మంటున్నారు


 Actress Sri Reddy sensational Comments on Telugu moviesహీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వమంటే పక్కలోకి రావాలని కండీషన్ పెడుతున్నారని ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు వరుసగా ఎంతమంది పక్కలో పడుకోవాలో తెలీదు అంత దారుణంగా ఉంది తెలుగు సినిమా పరిస్థితి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీ రెడ్డి అనే నటి . నచ్చావులే , ఏ ఫిలిం బై అరవింద్ , చందమామలో అమృతం , ఈరోజుల్లో , గోల్కొండ హై స్కూల్ , చమ్మక్ చల్లో తదితర చిత్రాల్లో నటించింది ఈ భామ .

 

తెలుగు సినిమా రంగం కేవలం నాలుగు కుటుంబాల కనుసన్నళ్ళలో నడుస్తోందని , హీరోయిన్ లను పక్కలో పడుకోమని కోరే వాళ్లలో కొంతమంది అగ్ర హీరోలు కూడా ఉన్నారని కానీ వాళ్ళ పేర్లు చెప్పలేనని సంచలనం సృష్టించింది . తెలుగు అమ్మాయిలు హీరోయిన్ లుగా పనికి రారా ? కేవలం సైడ్ క్యారెక్టర్ లేదంటే చెల్లెలు పాత్రలకు మాత్రమే తెలుగు వాళ్ళని తీసుకుంటున్నారని కానీ హీరోయిన్ లుగా మాత్రం బిజీ గా ఉన్న హీరోయిన్ ల వెంట పడుతున్నారని వాళ్ళకంటే మేము ఏమైనా తక్కువ తిన్నామా ? అంటూ ఓ ఛానల్ కు వచ్చి కాస్టింగ్ కౌచ్ పై ఆరోపణలు చేసింది శ్రీ రెడ్డి . ఎంతో కస్టపడి ఫిగర్ ని మెయింటేన్ చేస్తున్నామని అలాగే మిగతా హీరోయిన్ లలాగే స్కిన్ షో చేయడానికి నేను రెడీ అని సవాల్ విసురుతోంది దర్శక నిర్మాతలకు .