నాకు ప్రాణ భ‌యం వుంది: శ్రీ‌సుధ‌

నాకు ప్రాణ భ‌యం వుంది: శ్రీ‌సుధ‌
నాకు ప్రాణ భ‌యం వుంది: శ్రీ‌సుధ‌

సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్ కె. నాయుడుపై మ‌రోసారి న‌టి శ్రీ సుధ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. గ‌త కొన్ని నెల‌ల క్రితం శ్యామ్ కె. నాయుడు త‌న‌ని పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పి మోసం చేశాడంటూ అత‌నిపై ఎస్సార్ న‌గ‌ర్ పోలీస్టేష‌న్‌లో కేసు పెట్టి శ్రీ‌సుధ సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రోసారి శ్యామ్ కె. నాయుడుపై  న‌టి శ్రీ‌సుధ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

గ‌తంలో త‌ను పెట్టిన కేసుని ఉప‌సంహ‌రించుకోవాల‌ని త‌న‌పై ఒత్త‌డి తెస్తున్నాడ‌ని, త‌న‌కు ప్రాణ హాని వుందంటూ న‌టి శ్రీ‌సుధ తాజాగా శ్యామ్ కె. నాయుడుపై ఎస్సార్ న‌గ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. శ్రీ‌సుధ తాజా ఫిర్యాదుని సీరియ‌స్‌గా తీసుకున్న పోలీసులు శ్యామ్ కె. నాయుడుపై కేసు ఫైల్ చేశారు.

గ‌త ఏడాది మేలో త‌న‌ని పెళ్లి చేసుకుంటానంటూ న‌మ్మించి మోసం చేశాడంటూ పోలీసుల్ని ఆశ్ర‌యించింది. ఆ త‌రువాత త‌ను కేసుని విత్‌డ్రా చేసుకున్నానంటూ న‌కిలీ ప‌త్రాల‌ని కోర్టులో చూపించి కోర్టుని త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు అత‌న్ని అరెస్ట్ చేయ‌లేద‌ని తాజా కంప్లైంట్‌లో శ్రీ‌సుధ పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఈ వ్య‌వ‌హారంలో ఆర్ట్ డైరెక్ట‌ర్ చిన్నా, స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్ సాయిరాం మాగంటి తాను శ్యామ్ కె. నాయుడుపై పెట్టిన కేసుని ఉప‌సంహ‌రించుకోవాల‌ని బెదిరించార‌ని, అంతే కాకుండా గ‌తేడాది ఆగ‌స్టు 5న ఆర్ట్ డైరెక్ట‌ర్ చిన్నా ఇంటికి పిలిపించి అక్క‌డ త‌న‌ని స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్ సాయిరాం మాగంటి, శ్యామ్ కె. నాయుడు బెదిరించ‌డ‌మే కాకుండా శారీర‌కంగా దాడికి పాల్ప‌డ్డార‌ని శ్రీ‌సుధ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. దీంతో ఈ కేసు ప్ర‌స్తుతం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది.