ప్రభాస్ పై సంచలన ఆరోపణలు చేసింది


actress srireddy sensational comments on prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై సంచలన ఆరోపణలు చేసి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది శ్రీరెడ్డి అనే నటి . చిన్నా చితక సినిమాలలో నటించిన ఈ భామ ఇటీవలే ఛానల్ ముందుకు వచ్చి పక్కలో పడుకుంటే కానీ హీరోయిన్ గా ఛాన్స్ లు ఇవ్వడం లేదని ఇక కొంతమంది ఆ అవసరం తీర్చుకొని కూడా ఛాన్స్ లు ఇవ్వడం లేదని తీవ్ర ఆరోపణలు చేసింది . ఇక ప్రభాస్ కు హైట్ పిచ్చి ఉందని అందుకే హైట్ లేని నిత్యా మీనన్ , సమంత లను తన పక్కన నటించే అవకాశం ఇవ్వడం లేదని ఘాటుగా విమర్శించింది .

 

ప్రభాస్ తో పాటు పవన్ కళ్యాణ్ ని కూడా వదిలిపెట్టలేదు , మైకు ముందుకు వచ్చి నీతులు చెప్పడం కాదు తెలుగమ్మాయిలకు హీరోయిన్ గా ఛాన్స్ ఇప్పించండి అంటూ హితువు పలికింది శ్రీరెడ్డి . రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు వేడెక్కాయి కాబట్టి సరిపోయింది కానీ లేదంటే శ్రీరెడ్డి వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించేవి .