నాని పై సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి


actress srireddy sensational comments on tollywood heroన్యాచురల్ స్టార్ అనేది హీరో నాని బిరుదు అన్న విషయం తెలిసిందే పైగా నాని కి ఓ సంవత్సరం ఉన్న కొడుకు ఉన్నాడు సరిగ్గా ఇవే విషయాలను ఉదహరిస్తూ హీరో నాని పేరు ప్రస్తావన తీసుకు రాకుండా సంచలన ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి . అతడు తెరమీద న్యాచురల్ గా నటిస్తాడు అతడి నటన ముందు ఎన్టీఆర్ , మహేష్ , చరణ్ లు కూడా ఎంతో నేర్చుకోవాల్సి ఉంది అంటూ ఘాటుగా విమర్శలు చేసింది శ్రీరెడ్డి .

ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చానని నటన ప్రదర్శిస్తాడని , బోలెడు మంది అమ్మాయిల జీవితాలతో ఈ హీరో ఆడుకున్నాడని అతడికి త్వరలోనే సినిమా రంగం తగిన శిక్ష విధిస్తుందని కాకపోతే దానికి సమయం రావాలని పెద్ద బాంబే పేల్చింది . ఈమధ్య వరుస విజయాలు రావడంతో యాటిట్యూడ్ చూపిస్తున్నాడని , చిన్న దర్శకులకు అంతగా గౌరవం ఇవ్వదని న్యాచురల్ హీరో పై సంచలన ఆరోపణలు చేస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది . ఇన్నాళ్లు శ్రీరెడ్డి చేసిన నిర్వాకం ఒక ఎత్తు కాగా తాజాగా న్యాచురల్ హీరో పై ఆరోపణలు చేసిన నేపథ్యంలో మరీ సీరియస్ అవ్వడం ఖాయం .