న‌టి సుమ‌ల‌త‌కు క‌రోనా పాజిటివ్‌!

న‌టి సుమ‌ల‌త‌కు క‌రోనా పాజిటివ్‌!
న‌టి సుమ‌ల‌త‌కు క‌రోనా పాజిటివ్‌!

క‌రోనా వైర‌స్ స్వైర విహారం చేస్తోంది. దేశ వ్యాప్తంగా 7 ల‌క్ష‌లు దాటాయి. మ‌ర‌ణాలు 20 వేలు దాటిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వాలు ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా వైర‌స్ మాత్రం ప్ర‌మాద‌క‌ర స్థాయిలో వ్యాపిస్తూనే వుంది. తాజాగా మాండ్య ఎంపీ, సీనియ‌ర్ న‌టి సుమ‌ల‌త క‌రోనా బారిన ప‌డ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. ఇటీవ‌ల విధ కార్య‌క్ర‌మాల్లో సుమ‌ల‌త పాల్గొన్నారు. దీంతో ఆమెకి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా సోకిన‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం ఆమె హోమ్ క్వారెంటైన్‌లో వున్నారు.

త‌న‌కు కోవిడ్ సోకిన విష‌యాన్ని స్వ‌యంగా సుమల‌త వెల్ల‌డించింది. నా టెస్ట్‌ల రిజ‌ల్ట్ వ‌చ్చింది. పాజిటివ్ అని తేలింది` అని సుమ‌ల‌త వెల్ల‌డించారు. ఈ విష‌యం తెలియ‌డంతో ఆమె ఇంట్లో వున్నా వారికి కూడా క‌రోనా పరీక్ష‌లు నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం సుమ‌ల‌త ఆరోగ్యం నిల‌క‌డ‌గానే వుంద‌ని, హోమ్ క్వారెంటైన్‌లో వుంటూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటే స‌రిపోతుంద‌ని డాక్ట‌ర్లు వెల్ల‌డించిన‌ట్టు తెలిసింది.

భ‌ర్త క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ అంబ‌రీష్ ఇటీవ‌ల  మ‌ర‌ణించ‌డంతో ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మాండ్య నుంచి ఎంపీగా పోటీచేసి అత్య‌ధిక మెజారిటీతో గెలుపొందారు సుమ‌ల‌త‌. ఆమె విజ‌యం సాధించాల‌ని `కేజీఎఫ్‌` స్టార్ య‌ష్‌తో పాటు ద‌ర్శ‌న్ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేశారు.