సురేఖా వాణి అవ‌న్నీ పుకార్లే అంటోంది!


actress surekha vani coment on her second marriage rumors
actress surekha vani coment on her second marriage rumors

ఇటీవ‌ల ప్ర‌ముఖ సింగ‌ర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత రెండో వివాహం చేసుకుని వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే. తాజాగా ఇదే త‌ర‌హాలో ఓ న‌టి రెండో వివాహానికి సిద్ధ‌మౌతోందంటూ ఇటీవ‌ల వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. వివ‌రాల్లోకి వెళితే.. గ‌త కొంత కాలంగా భ‌ర్త‌తో విడిపోయి ఇద్ద‌రు పిల్ల‌ల‌తో జీవితాన్ని సాగిస్తున్న సింగ‌ర్ సునీత అనూహ్యంగా ఇటీవ‌ల రామ్ వీర‌ప‌నేని ని రెండో వివాహం చేసుకుని షాకిచ్చిన విష‌యం తెలిసిందే.

గ‌త కొంత కాలం క్రితం న‌టి సురేఖావాణి భ‌ర్త అనారోగ్యం కార‌ణంగా క‌న్నుమూశారు. అప్ప‌టి నుంచి సురేఖా వాణి త‌న పిల్ల‌తో ఒంట‌రిగానే జీవితాన్ని సాగిస్తోంది. అయితే ఈమె కూడా సింగ‌ర్ సునీత త‌ర‌హాలోనే రెండ‌వ వివాహానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు షికారు చేస్తున్నాయి. అయితే ఇవ‌న్నీ వ‌ట్టి పుకార్లే అని తాజాగా సురేఖా వాణి కొట్టి పారేసింది.

త‌ను రెండో పెళ్లి చేసుకుంటున్నానంటూ వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని, అవ‌న్నీ వ‌ట్టి పుకార్లే న‌ని కొట్టి పారేసింది. త‌న పెళ్లిపై వ‌స్తున్న పుకార్ల‌ని ఎవ‌రూ న‌మ్మ‌వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో సురేఖా వాణి పెళ్లి వార్త‌లు వ‌ట్టి గాలి వార్త‌లే అని తేలిపోయింది.