పెళ్లి వార్తలను ఖండించింది


actress Tamannah Bhatia not on groom huntనాకు పెళ్లి అంటూ రకరకాల కథనాలు వండి వారుస్తున్నారు కానీ నాకు సినిమాలంటే ప్రేమ అంతేకాని నేను ఎవరినీ ప్రేమించడం లేదు …… పెళ్లి చేసుకోవడం లేదని పెళ్లి వార్తలను ఖండిస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా . గతకొంత కాలంగా తమన్నా పెళ్లి అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే . ఇక తాజాగా ఓ విదేశీయుడిని పెళ్లి చేసుకోబోతోంది పైగా పలు బిజినెస్ లున్న డాక్టర్ అని వార్తలు రావడంతో నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ అయ్యింది తమన్నా పెళ్లి .

అయితే నేను పెళ్లి చేసుకోవడం లేదని , ప్రస్తుతం నా ధ్యాసంతా సినిమాల మీదే అని అంటోంది తమన్నా . తెలుగు , తమిళ , హిందీ చిత్రాల్లో నటించిన ఈ భామ కొద్దిరోజులుగా సక్సెస్ లేక ఇబ్బంది పడుతోంది . సక్సెస్ లేకపోవడంతో పాటుగా పెద్దగా చేతిలో సినిమాలు లేకుండా పోయాయి దాంతో పెళ్లి నిజమే అనుకున్నారు కట్ చేస్తే పెళ్లి వార్తలను ఖండిస్తోంది . అయితే ఇలాగే శ్రియా శరన్ అనే హీరోయిన్ కూడా ఘాటుగా స్పందించింది పెళ్లి వార్తల మీద . కట్ చేస్తే ……. వెంటనే పెళ్లి అయిపొయింది శ్రియా ది , ఆ భామ లాగే తమన్నా చేస్తుందా ? లేక పెళ్లి ఇప్పట్లో నిజంగానే లేదా ? చూడాలి .

English Title: actress tamannah bhatia not on groom hunt