తమన్నా పెళ్లి చేసుకోబోతోందా


actress tamannah is going to marry america doctor

మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది . 28 ఏళ్ల తమన్నా ఈమధ్య రేసులో వెనుకబడిపోయింది దాంతో పెళ్లి మీదకు గాలి మళ్లినట్లుంది . అమెరికాలో డాక్టర్ అయిన ఓ వ్యక్తి ని పెళ్లాడనున్నట్లు తెలుస్తోంది . మంచి సంబంధం కావడం , అతడు డాక్టర్ కావడం అలాగే అతడికి పలు వ్యాపారాలు కూడా ఉండటంతో వెల్ సెటిల్డ్ అయిన ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి తమన్నా సుముఖత వ్యక్తం చేసిందట . ఇరు కుటుంబాలు కలుసుకొని పెళ్లి విషయంలో ఒక అవగాహనకు వచ్చారట ! ఇంకేముంది త్వరలోనే వివాహ నిశ్చితార్థం తో పాటుగా పెళ్లి కూడా జరుగనుందని తెలుస్తోంది .

తెలుగు , తమిళ , హిందీ చిత్రాల్లో నటించిన తమన్నా కు తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చింది అయితే ఆ స్టార్ డం ని నిలుపుకోలేక పోయింది …… తక్కువ సమయంలోనే మళ్ళీ తన స్టార్ డం ని కోల్పోయింది తమన్నా . ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను కంప్లీట్ చేయడానికి సమాయత్తం అవుతోంది , ఇటీవల నందమూరి కళ్యాణ్ రామ్ సరసన నటించిన ” నా నువ్వే ” డిజాస్టర్ అయ్యింది . కొంతమంది 35 ఏళ్ళు వచ్చినా పెళ్ళికి సిద్దపడటం లేదు కానీ తమన్నా మాత్రం ఇంకా ముప్పై అందుకోకుండానే పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతోంది .

English Title: actress tamannah is going to marry america doctor