ఈ భామని గుర్తు పట్టారా


actress thanushree dutta come back mumbai after two yearsఈ ఫోటోలో సోడా బుడ్డి లాంటి కళ్ళజోడు పెట్టుకొని , కాస్త లావై జుట్టుని పైకి ఎగదోసి కట్టిన ఈ భామ ఎవరో తెలుసా ? గుర్తు పట్టారా ? గుర్తుకు రావడం లేదా ? గుర్తు పట్టలేక పోతున్నారా ? తను బాలీవుడ్ హాట్ భామ ” తనుశ్రీ దత్తా ” . బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ తెలుగులో కూడా రెండు చిత్రాల్లో నటించింది అందునా అగ్ర హీరో బాలకృష్ణ సరసన ” వీరభద్ర ” చిత్రంలో నటించింది తనుశ్రీ దత్తా . బాలయ్య తో నటించిన సినిమా సరిగ్గా ఆడకపోవడంతో ఈ భామని మళ్ళీ ఎవరూ తీసుకోలేదు అయితే బాలీవుడ్ లో మాత్రం పలు హిట్ చిత్రాల్లో నటించింది .

సినిమాల్లో అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోవడంతో రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే ఉంది ఇన్నాళ్లు , కట్ చేస్తే రెండేళ్ల తర్వాత ముంబై లో అడుగుపెట్టింది ఈ గెటప్ లో . తనుశ్రీ దత్తా అంటే స్లిమ్ గా ఉండేది కానీ రెండేళ్ల పాటు సినిమాలు లేక షికారు కెళ్ళింది కాబట్టి లావయ్యింది దాంతో గుర్తు పట్టడం కష్టంగా మారింది . అంతేకాదు ఇండియాకు రెండేళ్ల తర్వాత వస్తున్నాను దాంతో సంతోషంగా ఉన్నాను అలాగే ఆందోళన గా కూడా ఉంది అని ట్వీట్ చేసింది తనుశ్రీ దత్తా . అయితే ఫ్యామిలీ పరంగా కూడా కొన్ని చిక్కులు ఉన్నాయట దాంతో మళ్ళీ ఇంటికి వస్తుండటంతో కొంత గందరగోళమే ఉందట తనుశ్రీ దత్తా పరిస్థితి .

English Title: actress thanushree dutta come back mumbai after two years

actress thanushree dutta come back mumbai after two years