సినిమాలకు గుడ్ బై చెప్పిన హీరోయిన్

Actress Zaira Wasim sensational decision
Actress Zaira Wasim sensational decision

దంగల్ చిత్రంలో అమీర్ ఖాన్ కూతురు గా నటించి విమర్శకుల ప్రశంసలను అందుకున్న భామ ” జైరా వాసిం ” . అయితే దంగల్ తర్వాత ఈ భామకు పలు చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి కానీ ఈమె ముస్లిం కావడంతో పెద్ద ఎత్తున మతస్థులు అలాగే యువకులు వాసిం పై బెదిరింపులకు దిగారట . ముస్లిం వై ఉండి అంగాంగ ప్రదర్శన చేస్తావా ? అంటూ మండిపడటమే కాకుండా సినిమాల్లో కూడా నటించొద్దు అని గట్టిగా హెచ్చరికలు జారీ చేశారట .

అయినా ఎవరెన్ని బెరింపులకు పాల్పడినా పోరాడింది కానీ సినిమారంగంలో కూడా కొంతమంది లైంగిక వేధింపులకు గురిచేస్తుండటంతో వాటిని తట్టుకోలేక సినిమాలకు గుడ్ బై చెప్పేసింది . తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో ఇకపై సినిమాల్లో నటించడం లేదు అంటూ పోస్ట్ చేసి షాక్ ఇచ్చింది జైరా వాసిం .