అదాశ‌ర్మ…యోగా చిట్కాలు ఇలా కూడానా..?అదాశ‌ర్మ...యోగా చిట్కాలు ఇలా కూడానా..?
అదాశ‌ర్మ…యోగా చిట్కాలు ఇలా కూడానా..?

మ‌న దైనందిన జీవితంలో యోగా చాలా ప్ర‌ధానం. అయితే ఫాస్ట్ లైఫ్‌కు అల‌వాటు ప‌డిన జ‌నాలు యోగాకే టైమ్‌ని కేటాయించ‌డం లేదు. ఈ గ‌జిబిజి లైఫ్‌లో ఆ టైమే వుండ‌టం లేదు ఎవ‌రికీ. అయితే అలాంటి వారంతా ఇప్పుడు కరోనా భయం కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మై పోయారు. ఇంటి ప‌ట్టునే వుంటూ కుటుంబంతో కాల‌క్షేపం చేస్తున్నారు.

అలాంటి వారికి ఆదాశ‌ర్మ యోగా చిట్కాలు చెబుతోంది. తెలుగులో `హార్ట్ ఎటాక్` చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ ఉత్త‌రాది చిన్న‌ది ఆ త‌రువాత తెలుగు సినిమాల్లో క‌నిపించినా పెద్ద‌గా రాణించ‌లేకపోయింది. మార్ష‌ల్ ఆర్ట్స్‌లో అదాకు మంచి ప్రావీణ్యం వుంది. అంత‌కు మించి యోగాలోనూ ఆమెకు మంచి ప‌ట్టుంది. స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా రోప్ యోగాకు సంబంధించిన వీడియోల‌ని పోస్ట్ చేస్తున్న అదాశ‌ర్మ తాజాగా సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన వీడియో ఆక‌ట్టుకుంటోంది.

క‌రోనా కార‌ణంగా ఇంటికే ప‌రిమితం కావ‌డంతో ఆ స‌మ‌యాన్ని ఇంట్లో వ‌స్తువుల్ని శుభ్రం చేయ‌డానికి వినియోగిస్తూనే వెరైటీగా ఫ్లోర్ క్లీన్ యోగా చేస్తోంది అదా. యోగా చేయ‌డానికి టైమ్ లేద‌ని చెప్పే వాళ్ల‌కు తానొక ప‌రిష్కారం చూపిస్తాన‌ని అంటూ ఫ్లోర్ క్లీన్ చేస్తూనే ట‌ఫ్ యోగా చేస్టూ అంద‌రిని అవాక్క‌య్యేలా చేస్తోంది. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.