అవ‌కాశం కోసం కోరిక‌ని ఎందుకు తీర్చాలి!


అవ‌కాశం కోసం కోరిక‌ని ఎందుకు తీర్చాలి!
అవ‌కాశం కోసం కోరిక‌ని ఎందుకు తీర్చాలి!

కాస్టింగ్ కౌచ్ వివాదం దేశ వ్య‌ప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. టాలీవుడ్‌లో శ్రీ‌రెడ్డి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ వివాదం గ‌త కొంత కాలం వ‌ర‌కు ప‌లు చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్ని ఓ ఊపు ఊపాయి. తాజాగా ఈ వివాదంపై నితిన్ హీరోయిన్ అదా శ‌ర్మ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. తొలి సారి కాస్టింగ్ కౌచ్‌పై  స్పందించింది.

తెలుగులో నితిన్ హీరోగా న‌టించిన `హార్ట్ ఎటాక్` చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన అదా శ‌ర్మ ఆ త‌రువాత ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. త‌మిళ‌, క‌న్న‌డ చిత్రాల్లో న‌టించినా ప్ర‌స్తుతం హిందీ చిత్రాల‌కే ప‌రిమితం అయిపోయింది. కాస్టింగ్ కౌచ్ వివాదం గురించి అదా మాట్లాడుతూ `కాస్టింగ్ కౌచ్ ఉత్త‌ర భార‌తంలోనూ, లేదా ద‌క్షిణ భార‌తంలోనూ మాత్ర‌మే చ‌ర్చించిన అంశం కాద‌ని, దీనిపై ప్ర‌పంచ వ్యాప్తంగా మాట్లాడుతున్నార‌ని వెల్ల‌డించింది.

కాస్టింగ్ కౌచ్ అనేది ఎవ‌రు బ‌ల‌వంతంగా చేయ‌ర‌ని, త‌ప్పు చేయాలా? వ‌ద్దా? అనే ఆప్ష‌న్ ప్ర‌తి ఒక్క‌రికీ వుంటుంద‌ని, అవ‌కాశం కోసం కోరిక‌ని ఎందుకు తీర్చాలి అని, అలాంటి ప‌రిస్థితి వ‌స్తే అవ‌కాశాన్ని వ‌దులు కోవాలి లేదా క‌మిట్‌మెంట్‌ల‌కు నో చెప్పాల‌ని స్ప‌ష్టం చేయ‌డం ఆసక్తిక‌రంగా మారింది.