గ్రీకుసుంద‌రికి టాలీవుడ్ కాదు.. హాలీవుడ్ వెళ్లాల్సిందే!


గ్రీకుసుంద‌రికి టాలీవుడ్ కాదు.. హాలీవుడ్ వెళ్లాల్సిందే!
గ్రీకుసుంద‌రికి టాలీవుడ్ కాదు.. హాలీవుడ్ వెళ్లాల్సిందే!

పూరి జ‌గ‌న్నాథ్ టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేసిన హాటీ ఆదా శ‌ర్మ. `హార్ట్ ఎటాక్‌`తో యువ హృద‌యాల్లో హాట్ బీట్ పెంచేసింది. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం అవ‌కాశాల్ని ద‌క్కించుకోలేక‌పోయింది. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, గ‌రం, క్ష‌ణం, క‌ల్కీ వంటి చిత్రాల్లో న‌టించినా ఎలాంటి ఫ‌లితం లేకుండా పోయింది.

దీంతో మ‌కాం బాలీవుడ్‌కు మార్చేసింది. ప్ర‌స్తుతం అక్క‌డ కూడా పెద్ద‌గా ప్ర‌భావితం చూపించ‌లేక‌పోతోంది. ప్ర‌స్తుతం `క్వొశ్చ‌న్ మార్క్‌` చిత్రంలో న‌టిస్తోంది. చేతిలో సినిమాలేవీ లేక‌పోవ‌డంతో సోష‌ల్ మీడియాలో వ‌రుస ఫొటోల‌తో పిచ్చెక్కిస్తోంది. అదాకు వందేళ్లు వ‌చ్చేశాయంటూ తిక్క‌తిక్క పోస్ట్‌లు పెట్టేస్తూ తనో గ్రీకుసుంద‌రిలా ఊహించుకుంటోంది.

అక్క‌డితో ఆగ‌లేదు స‌రిక‌దా క‌ల‌ర్ క‌ల‌ర్ హెయిర్ స్టైల్స్‌తో వ‌రుస పిక్‌ల‌తో నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. తాజాగా బ్లూక‌ల‌ర్ హెయిర్ స్టైల్‌.. భారీ ముక్కుపోగుతో.. ఒ‌ళ్లంతా జ్యువెల్ల‌రీని ధ‌రించి బ్రాక‌ట్ తో  గ్రీకు సుంద‌రిలా ముస్తాబై వెరైటీ ముస్తాబై షాకిచ్చింది. మోస్ట్‌లీ టాలెంటెడ్ హీరోయిన్ గా త‌న‌ని తాను ఊహించుకున్న ఆదాకు టాలీవుడ్‌లో పెద్ద‌గా అవ‌కాశాలు లేవు.. బాలీవుడ్ లో వున్నా అవి పెద్ద సినిమాలు కాదు. దీంతో త‌న క్రియేటివిటీకి ప‌దును పెట్టి ఇలా వ‌రుస వెరైటీ ఫొటోషూట్‌ల‌తో పిచ్చెక్కిస్తోంది. దీంతో ఆమె క్రియేటివిని చూసి త‌ట్టుకోలేని నెటిజ‌న్స్ అదాకు టాలీవుడ్ బాలీవుడ్  స‌‌రిపోదేమో హాలీవుడ్ వెళ్లాల్సిందే అంటున్నారు.