కన్నీళ్ల పర్యంతం అయిన అడవి శేష్


Adivi Sesh
Adivi Sesh

హీరో అడవి శేష్ తన కష్టాలను చెప్పుకుంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. నేను అమెరికా నుండి వచ్చాను కాబట్టి బాగా డబ్బున్నోడు అని అనుకున్నారు కానీ నాకు కూడా కృష్ణానగర్ కష్టాలు ఉన్నాయని తన బాధలను చెప్పుకుంటూ ఉద్వేగానికి లోనయ్యాడు . ఈరోజు జరిగిన ఎవరు థాంక్స్ మీట్ లో పాల్గొన్న అడవి శేష్ తన కష్టాలను చెప్పాడు.

నేను హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన కిస్ చిత్రం ప్లాప్ అవ్వడంతో రెండు మూడు కోట్ల అప్పు మిగిలిందని ఆ అప్పు తీర్చమని నన్ను ఢిల్లీ లో ఓ పదిమంది పోలీసులు చుట్టుముట్టి కర్రలతో కొట్టడానికి సిద్ధమయ్యారని , అప్పు ఎప్పుడు తీర్చుతావని భయపెట్టారని అలాంటి దారుణమైన పరిస్థితి నుండి నేను ఈరోజు సక్సెస్ వైపు అడుగులు వేశానని తెలిపాడు అడవి శేష్ .

తాజాగా అడవి శేష్ , రెజీనా కాసాండ్రా నటించిన ఎవరు హిట్ అయిన నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన అడవి శేష్ భయంకరమైన తన అనుభవాలను పంచుకున్నాడు . కిస్ సినిమా ఇచ్చిన అవమానాలతో రాటుదేలిన అడవి శేష్ చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు …… వరుస విజయాలు సాధిస్తున్నాడు .