10 కోట్ల షేర్ సాధించిన ఎవరు


Evaru Collections
Evaru Collections

అడవి శేష్ హీరోగా నటించిన ఎవరు చిత్రం మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల షేర్ సాధించి సంచలనం సృష్టించింది .

ఆగస్టు 15 న విడుదలైన ఈ చిత్రానికి యునానిమస్ గా హిట్ టాక్ వచ్చింది . రిలీజ్ కి ముందే టేబుల్ ప్రాఫిట్ గా పేరు తెచ్చుకున్న ఎవరు చిత్రం విడుదల అయ్యాక బయ్యర్లకు కూడా లాభాలు తెచ్చిపెడుతోంది .

మొదటి వారంలోనే 10 కోట్ల షేర్ రాబట్టడంలో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది . రెజీనా కాసాండ్రా కు కూడా చాలా రోజుల తర్వాత కమర్షియల్ హిట్ రావడంతో ఉబ్బి తబ్బిబ్బై పోతోంది.

అలాగే ఎవరు చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచింది . దాంతో విమర్శకుల ప్రశంసలతో పాటుగా ప్రేక్షకుల రివార్డులు కూడా లభిస్తున్నాయి . ఇక అడవి శేష్ విషయానికి వస్తే …… సెలెక్టివ్ గా చిత్రాలను ఎంచుకుంటూ వరుస విజయాలు సాధిస్తున్నాడు .