విలన్ గా ఛాన్స్ ఇవ్వలేదు కానీ……


Adavi shesh join hands with Dil Raju
Adavi shesh join hands with Dil Raju

రాంచరణ్ తేజ్ – అల్లు అర్జున్ లు నటించిన ”ఎవడు” చిత్రంలో విలన్ గా ఛాన్స్ ఇవ్వమని దిల్ రాజు ఆఫీసు చుట్టూ తిరిగాడట హీరో అడవి శేష్ అయితే అప్పుడు ఆ సినిమాలో నటించే అవకాశం రాలేదు పాపం అడవి శేష్ కి కానీ ఇన్నేళ్ల తర్వాత దిల్
రాజు తన బ్యానర్ లో ఏకంగా అడవి శేష్ ని పెట్టి హీరోగా ఓ సినిమా తీస్తానని అంటున్నాడు.

దాంతో ఉబ్బి తబ్బిబ్బై పోతున్నాడు అడవి శేష్.

విలన్ గా ఛాన్స్ ఇవ్వలేదు కానీ ఇప్పుడు అదే బ్యానర్ లో హీరోగా నటించడానికి సిద్ధం అవుతున్నాడు.

ఆగస్టు 15 న విడుదలైన ఎవరు విజయం సాధించిన నేపథ్యంలో ఆ చిత్ర సక్సెస్ మీట్ కు గెస్ట్ గా వచ్చిన దిల్ రాజు అడవి శేష్ తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

విభిన్న తరహా కథా చిత్రాలు చేస్తూ వరుస విజయాలు సాధిస్తున్న అడవి శేష్ కు ఇప్పుడు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది. దాంతో ఎక్కడలేని డిమాండ్ ఏర్పడింది ఈ హీరోకు.