సెప్టెంబర్ లో ప్రారంభం కానున్న “మేజర్”


major still
major movie telugu

క్షణం, అమీతుమీ, గూఢచారి తో హ్యాట్రిక్ హిట్స్ సాధించిన అడవి శేష్ నటించిన ఎవరు సినిమా ఆగస్ట్ 15న రేపు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. రిలీజ్ కి ముందే పాజిటివ్ బజ్ ఏర్పడిన ఈ చిత్రం పై మంచి ఎక్స్ పెక్టేషన్స్ వున్నాయి.

రెజీనా కాసాండ్రా, నవీన్ చంద్ర నటించిన ఈ చిత్రానికి వెంకట్ రాంజీ దర్శకత్వం వహించారు. ఇక శేష్ నటించే ‘మేజర్’ చిత్రం సెప్టెంబర్ లో మొదలు కానుంది. ఈ చిత్రాన్ని మహేష్ బాబు, సోనీ మ్యూజిక్ నిర్మించనున్నారు. శశి కిరణ్ తిక్క ఈ చిత్రానికి దర్శకుడు. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

అశోక్ చక్ర బిరుదు పొందిన ఆయన కార్గిల్ యుద్ధం అనంతరం ముంబై హోటల్ బాంబ్ పేలుళ్ల సమయంలో అనేక మండిన రక్షించి ఆ కాల్పుల్లో మరణించారు. ఇప్పుడు ఆయన బయోపిక్ ని మేజర్ రూపంలో సినిమాగా రాబోతుంది. అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.