ఆదా శర్మ చేసిన చిలిపి పని!!


adha sharma
adha sharma

‘హార్ట్‌ ఎటాక్‌’ చిత్రంతో కుర్రకారు మనసులు దోచిన నటి అదా శర్మ. ఈ ఫొటోలోని కథానాయికను గుర్తుపట్టారా?.. ఎత్తుపళ్లు, చేతిలో పిజ్జాతో కాస్త విచిత్రంగా ఉన్న ఈమె ఎవరో కాదండీ. ఈ భామ ట్విటర్‌లో ఈ ఫొటోను పోస్ట్‌ చేశారు. ‘ఎవరో గుర్తు పట్టండి చూద్దాం..’ అని ట్వీట్‌ చేశారు. అయితే అక్కడ ఉన్నది ఆమేనని అభిమానులు గుర్తు పట్టేశారు. ‘నువ్వు ఎంత మేకప్‌ వేసినా మేం గుర్తు పట్టగలం, నువ్వే..’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. మరి అదా శర్మ ఈ లుక్‌లో ఇలా ఎందుకు తయారయిందో చెప్పలేం…

క్షణం’ తర్వాత అదా తెలుగులో రీసెంట్ గా ‘కల్కి’ చిత్రంలో నటించారు. రాజశేఖర్‌ కథానాయకుడి పాత్ర పోశించిన ఈ సినిమాకు ప్రశాంత్‌ వర్మ దర్శకుడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం పర్వాలేదు అనిపించుకున్నా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. అదా శర్కను కల్కి కూడా కాపాడలేక పోయింది. ప్రస్తుతం ఆమె ‘కమాండో 3’, ‘బైపాస్‌ రోడ్‌’ అనే హిందీ చిత్రాల్లో నటిస్తూన్నారు. దీంతోపాటు వెబ్‌ సిరీస్‌లోనూ సందడి చేస్తున్నారు. మొదటిసారి ‘ది హాలిడే’ అనే సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌కు సంబంధించిన తొలి ఎపిసోడ్‌ ఇటీవల విడుదలైంది.. మరి తెలుగులో మాత్రం ఇంత వరకూ ఏ సినిమాకూడా కమిట్ కాలేదు.. !!