నాని మూవీ కోసం ఆ ఇద్ద‌రు?నాని మూవీ కోసం ఆ ఇద్ద‌రు?
నాని మూవీ కోసం ఆ ఇద్ద‌రు?

నేచుర‌ల్ స్టార్ నాని యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `వి` త‌రువాత స్పీడు పెంచారు. గ‌త ఎనిమిది నెల‌లుగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోవ‌డంతో ఇంటి ప‌ట్టునే వున్న నాని తాజాగా సినిమా షూటింగ్‌ల‌న్నీ పునః ప్రారంభం కావ‌డంతో నాని తను న‌టిస్తున్న`ట‌క్ జ‌గ‌దీష్` షూటింగ్‌ని మొద‌లుపెట్టేశాడు. ఈ చిత్రానికి శివ‌ నిర్వాణ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ఇదిలా వుంటే నాని మ‌రో రెండు చిత్రాల్ని లైన్‌లో పెట్టారు. రాహుల్ సంక్రీత్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో `శ్యామ్ సింగ‌రాయ్‌`, వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో `అంటే .. సుంద‌రానికి` చిత్రాల్లో న‌టించ‌బోతున్నారు. ఈ రెండు చిత్రాల్లో `శ్యామ్ సింగ్‌రాయ్` త్వ‌ర‌లో ప్రారంభం కాబోతోంది. ఇందులో `ఉప్పెన‌` ఫేమ్ క్రితిశెట్టి హీరోయిన్‌గా న‌టించ‌బోతోంది.

విభిన్న‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో నాని 60 ఏళ్ల ముదుస‌లిగా క‌నిపించ‌నున్న ఈ మూవీలో ఓ కీల‌క అతిథి పాత్ర వుంద‌ట‌. ఆ పాత్ర కోసం అదితిరావు హైద‌రీ, నివేదా థామ‌స్‌లలో ఒక‌రిని అనుకుంటున్నార‌ట‌. ఈ ఇద్ద‌రు ఇప్ప‌టికే నానితో క‌లిసి న‌టించారు. అదితిరావు హైద‌రీ `వి` చిత్రంలో నానితో క‌లిసి న‌టించింది. నివేదా థామ‌స్ `జెంటిల్‌మ‌న్‌`, వి చిత్రాల్లో న‌టించింది.