నాగ్ ని జక్కన్నని మెచ్చుకుంటున్న భామ


Aditi Rao Hydari comments on Nagarjuna and rajamouliమన్మధుడు నాగార్జున ని అలాగే దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి ని పొగడ్తలతో ముంచెత్తుతోంది బాలీవుడ్ భామ అదితిరావ్ హైదరి . తాజాగా ఈ భామ సుధీర్ బాబు హీరోగా నటించిన ” సమ్మోహనం ” చిత్రంలో నటించిన విషయం తెలిసిందే . మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన సమ్మోహనం చిత్రం ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే . సమ్మోహనం చిత్రంలోని అదితిరావ్ హైదరి నటనకు ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు . కాగా ఆ సందర్భాన్ని పురస్కరించుకొని సోషల్ మీడియాలో పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ నాగార్జున ని లెజెండ్ తో పోల్చింది అలాగే దర్శకులు రాజమౌళి ని కూడా పొగుడుతోంది .

తెలుగు భామ అయిన అదితిరావ్ హైదరి ముంబై లో స్థిరపడింది . మహబూబ్ నగర్ సంస్థానానికి చెందిన వంశస్థులు అదితిరావ్ హైదరి పూర్వీకులు కావడం విశేషం . బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ తాజాగా సమ్మోహనం తో తెలుగు ప్రేక్షకులను వశపరుచుకుంది . రాజమౌళి కాస్త ఆలస్యంగానైనా సమ్మోహనం చిత్రాన్ని చూడటం , సుధీర్ బాబు నటనతో పాటుగా అదితిరావ్ హైదరి నటనని ప్రశంసించాడు . తెలుగులో మరిన్ని మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తోంది ఈ భామ .