సుధీర్ బాబు కి మార్కులేసిన అదితిరావ్ హైదరి


aditi rao hydari praises sudheer babu acting

సుధీర్ బాబు షాట్ గ్యాప్ లో సైలెంట్ గా ఉంటాడు కానీ స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే ఆ పాత్రలోకి ఇట్టే మారిపోతాడు అతడితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది అని సుధీర్ బాబు యాక్టింగ్ కి మంచి మార్కులేస్తోంది బాలీవుడ్ హీరోయిన్ అదితిరావ్ హైదరి . మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు – అదితిరావ్ హైదరి జంటగా తెరకెక్కిన చిత్రం ” సమ్మోహనం ” . శ్రీదేవి మూవీస్ పతాకంపై తెరకెక్కిన సమ్మోహనం చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది ఈ అందాల ముద్దుగుమ్మ .

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చెలియా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది ఈ భామ అయితే తెలుగులో నేరుగా నటించిన చిత్రం మాత్రం ఈ సమ్మోహనమే ! ఈనెల 15 న సమ్మోహనం విడుదల అవుతున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన ఈ భామ పలు విషయాలను వెల్లడించింది . అయితే సుధీర్ బాబు గురించి అంతగా తెలియదు అలాగే అతడి సినిమాలు కూడా చూడలేదు కానీ హిందీలో భాగీ చిత్రంలో నటించాడని మాత్రమే విన్నాను , అయితే షూటింగ్ సమయంలో అతడి ప్రతిభ ఏంటో తెలిసింది అంటూ అతడి నటనకు ప్రశంసలు కురిపిస్తోంది అదితిరావ్ హైదరి . మనం మాత్రమే బాగా నటిస్తే సరిపోదు ఎదుటి వాళ్ళు కూడా అంతే బాగా నటించాలి అప్పుడే ఆ సీన్ మరింతగా పండుతుంది అని అంటోంది . సినిమా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఆదితిరావ్ హైదరి మాత్రమే కాదు సుధీర్ బాబు కూడా నమ్మకంగా ఉన్నాడు .