ఆర్ ఆర్ ఆర్ లో అదితి రావు హైదరి ?


Aditi rao hydari in RRR
Aditi rao hydari

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్ . జనవరి నెలలో రెండో షెడ్యూల్ ప్రారంభం కానుండగా ఆ చిత్రంలో హీరోయిన్ లను మాత్రం ఇంతవరకు ఖరారు చేయలేదు . అయితే తాజాగా వినబడుతున్న కథనం ప్రకారం ఆర్ ఆర్ ఆర్ లో ఒక హీరోయిన్ గా అదితి రావు హైదరి ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది . బాలీవుడ్ భామ అదితి రావు హైదరి టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే .

తాజాగా ఈ భామ నటించిన అంతరిక్షం విడుదల అయ్యింది . ఇక ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే ఎన్టీఆర్ – చరణ్ లపై పలు సన్నివేశాలను చిత్రీకరించాడు జక్కన్న కానీ హీరోయిన్ లను మాత్రం ఇంకా ఖరారు చేయలేదు , ఒకవేళ అదితి రావు హైదరి ఎంపిక నిజమే అయితే జక్కన్న ఆలోచన గొప్పదే అనే చెప్పాలి . అదితి రావు హైదరి కాకుండా కీర్తి సురేష్ , కియారా అద్వానీ పేర్లు కూడా వినబడుతున్నాయి . అయితే ఎవరెవరు అన్నది జక్కన్న ఖరారు చేయాల్సి ఉంది . 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి రామ రావణ రాజ్యం అనే టైటిల్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది .

English Title: Aditi rao hydari in RRR