అర్జున్ రెడ్డి తమిళ టీజర్ కి సూపర్ రెస్పాన్స్


Aditya varma teaser gets super responce
Aditya varma teaser gets super responce

తెలుగునాట సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని తమిళంలో ” ఆదిత్య వర్మ ” గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే . గిరీశాయ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిత్య వర్మ టీజర్ ని ఈరోజు విడుదల చేయగా దానికి అద్భుతమైన స్పందన వస్తోంది . ఇక హీరో ధృవ్ విక్రమ్ విజయ్ దేవరకొండ ని దాదాపుగా మరిపించాడు . తెలుగు అర్జున్ రెడ్డి లా టీజర్ ని కట్ చేసారు అంటే విజయ్ దేవరకొండ ని టచ్ చేసాం అని చెప్పడానికి కాబోలు .

తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ ఈ ఆదిత్య వర్మ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు . యూత్ కి నచ్చే అన్ని అంశాలు పుష్కలంగా ఉన్న ఈ చిత్రంతో తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందన్న ఆశాభావంతో ఉన్నారు . ఆదిత్య వర్మ ఎన్నో అవాంతరాలను దాటుకొని విడుదలకు సిద్ధమైంది .