వెంక‌టేష్ కాద‌న్నారు.. అడివి శేష్ అవున‌న్నారు!Adivi shesh in Article 15 remake
Adivi shesh in Article 15 remake

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఒక‌రు చేయాల‌నుకున్న సినిమా మ‌రొక‌రు చేయ‌డం, అది ఆ త‌రువాత బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిల‌వ‌డం తెలిసిందే. చాలా సినిమాలు అలా ఓ హీరో నుంచి మ‌రో హీరో చేతికి వెళ్లి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌లుగా మారిన సినిమాలు చాలానే వున్నాయి. తాజాగా అలాంటి ఓ సూప‌ర్ హిట్ సినిమా సీనియ‌ర్ హీరో వెంక‌టేష్ నుంచి యంగ్ హీరో అడివి శేష్ వ‌ద్ద‌కు వ‌చ్చింది. అదే `ఆర్టిక‌ల్ 15`.

ఆయుశ్మాన్ ఖురానా హీరోగా న‌టించి ఈ చిత్రం హిందీలో సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని కూడా సొంతం చేసుకుంది. అనుభ‌వ్ సిన్హా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ నిర్మించింది ఇదే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాల‌ని డి. సురేష్ బాబు రైట్స్ సొంతం చేసుకున్నారు. వెంక‌టేశ్ హీరో గా రీమేక్ చేయాల‌ని ప్లాన్ చేశారు.

అయితే ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ అదే చిత్రాన్ని అడివి శేష్ హీరోగా రీమేక్ చేయ‌బోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ త్వ‌ర‌లోనే రానున్న‌ట్టు తెలిసింది. అడివి శేష్ ప్ర‌స్తుతం `గూఢ‌చారి`కి సీక్వెల్‌గా రూపొందుతున్న `గూఢ‌చారి 2`తో పాటు మేజ‌ర్ సందీప్ ఉన్న‌కృష్ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న `మేజ‌ర్‌` చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ రెండు చిత్రాల త‌రువాత అడివి శేష్ `ఆర్టిక‌ల్ 15` రీమేక్‌లో న‌టిస్తార‌ట‌.