షాక్‌లో `మేజ‌ర్` టీమ్‌..షూటింగ్ ఆపేశారు!


షాక్‌లో `మేజ‌ర్` టీమ్‌..షూటింగ్ ఆపేశారు!
షాక్‌లో `మేజ‌ర్` టీమ్‌..షూటింగ్ ఆపేశారు!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా భారీ చిత్రాల నిర్మాణం ఆగిపోయింది. చిన్న సినిమాలు కూడా చాలా త‌క్కువ సంఖ్య‌లోనే షూటింగ్ చేస్తున్నాయి. పెద్ద చిత్రాల హీరోలు సెట్‌కు రావ‌డానికి వెనుకాడుతుంటే మినిమ‌మ్ గ్యారెంటీ హీరోలు మాత్రం క‌రోనాకు భ‌య‌ప‌డ‌కుండా కోవిడ్ జాగ్ర‌త్తలు పాటిస్తూ షూటింగ్‌లు కానిచ్చేస్తున్నారు. విభిన్న చిత్రాల‌తో ఆక‌ట్టుకుంటూ వ‌రుస విజ‌యాల్ని ద‌క్కించుకుంటున్న యంగ్ హీరో అడివి శేష్ కూడా `మేజ‌ర్‌` షూటింగ్‌ని మొద‌లుపెట్టాడు.

శ‌శి కిర‌ణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని సోనీ పిక్చ‌ర్స్‌తో క‌లిసి మ‌హేష్ బాబు నిర్మిస్తున్నారు. ఆగ‌స్టు వ‌ర‌కు చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ క‌రోనా దెబ్బ‌తో ఆ ప్లాన్ ఒక్క‌సారిగా మారిపోయింది. ఇటీవ‌ల ప్ర‌భుత్వం తిరిగి షూటింగ్ ల‌కు అనుమ‌తులు ఇవ్వ‌డంతో అతి త‌క్కువ మంది సిబ్బందితో `మేజ‌ర్‌` షూటింగ్‌ని మొద‌లుపెట్టారు. అయితే షూటింగ్ మొద‌లు పెట్టిన కొన్ని రోజుల‌కే టీమ్‌లో క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని తెలిసింది.

వి2యం తెలిసిన వెంట‌నే టీమ్ అంద‌రికి ప‌రీక్ష‌లు చేయించ‌గా అందులో స‌గం మందికి అంటే 20 మందికి క‌రోనా సోకిన‌ట్టు నిర్థార‌ణ కావ‌డంతో `మేజ‌ర్‌` టీమ్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింద‌ట‌. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా క‌రోనా కాటు త‌ప్ప‌డం లేద‌ని ఈ సంఘ‌ట‌న‌తో మ‌రోసారి రుజువైంది. విష‌యం తెలుసుకున్న మ‌హేష్ వెంట‌నే షూటింగ్ ఆపేసి టీమ్ మొత్తాన్ని హోమ్ క్వారెంటైన్‌కి వెళ్లాల్సిందిగా సూచించార‌ట‌. ముందు హెల్త్ ఆ త‌రువాతే షూటింగ్ అని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఇప్ప‌ట్లో షూటింగ్ మొద‌లుపెట్టొద్ద‌ని టీమ్‌కి మ‌హేష్ సూచించిన‌ట్టు తెలిసింది.