`మేజ‌ర్‌` టీజ‌ర్ టాక్‌: ఓ దేశ భ‌క్తుడి వీర‌గాథ

 

Adivi sheshs Major teaser launched
Adivi sheshs Major teaser launched

అడివి శేష్‌… కొత్త త‌ర‌హా చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `మేజ‌ర్`. శ‌శికిర‌ణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. స‌యీ మంజ్రేక‌ర్‌, శోభితా ధూళిపాల ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.సోనీ పిక్చ‌ర్స్‌తో క‌లిసి స్టార్ హీరో మ‌హేష్‌బాబు ఈ మూవీని నిర్మిస్తున్నారు. దేశం కోసం త‌న ప్రాణాల‌ని సైతం లెక్క‌చేయ‌కుండా వీరోచిత పోరాఠం చేసిన మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ వీర‌గాథ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తెలుగుతో పాటు మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో జూన్ 2న వ‌ర‌ల్డ్ వైడ్‌గా విడుద‌ల కానున్న ఈ మూవీ ప్ర‌ధానంగా ‌26/11 ముంబై తాజ్ హోట‌ల్ పై జ‌రిగిన ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్ర టీజ‌ర్‌ని సోమ‌వారం మూడు భాష‌ల‌కు చెందిన ముగ్గురు సూప‌ర్ స్టార్స్ రిలీజ్ చేశారు. తెలుగులో మ‌హేష్‌బాబు రిలీజ్ చేయ‌గా, హిందీలో స‌ల్మాన్‌ఖాన్‌, మ‌ల‌యాళంలో పృథ్వీరాజ్ సుకుమార‌న్ విడుద‌ల చేశారు.

`మ‌న బోర్డ‌ర్‌లో ఆర్మీ ఎలా ఫైట్ చేయాలి? ఇండియా క్రికెట్ మ్యాచ్ ఎలా గెల‌వాటి? అని అంద‌రూ ఆలోచిస్తారు. అదీ దేశ భ‌క్తే. దేశాన్ని ప్రేమించ‌డం అంద‌రి ప‌ని. వాళ్ల‌ని కాపాడ‌టం సోల్జ‌ర్ ప‌ని` అంటూ టీజ‌ర్‌లో అడివి శేష్ చెబుతున్న డైలాగ్‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. ప్ర‌కాష్‌రాజ్‌, ముర‌ళీశ‌ర్మ‌, రేవ‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చాత్రానికి శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.