బోల్డ్ బయోపిక్ ఫస్ట్ లుక్ వచ్చేసింది


Adult star Shakeela biopic first look release 

బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ షకీలా బయోపిక్ ఫస్ట్ లుక్ వచ్చేసింది . షకీలా పాత్రలో బాలీవుడ్ భామ రిచా చద్దా నటిస్తున్న విషయం తెలిసిందే . మలయాళ ఫిలిం ఇండస్ట్రీ లో టాప్ స్టార్స్ ని సైతం వణికిపోయేలా చేసిన భామ షకీలా . ఈ భామ నటించిన చిత్రాలన్నీ అడల్ట్ నేపథ్యంలో కాబట్టి పెద్ద హీరోల సినిమాలు విడుదల చేయాలంటే భయపడిపోయే వాళ్లంట . షకీలా సినిమా రిలీజ్ అయ్యాకే స్టార్ హీరోల సినిమాలు విడుదల అయ్యేవి అంతగా ప్రభావితం చేసింది షకీలా . ఈ భామ నటించిన అడల్ట్ చిత్రాలు టాలీవుడ్ లో కూడా విడుదల అయ్యాయి .

కట్ చేస్తే ఇప్పుడు షకీలా ట్రెండ్ లేదు కానీ బయోపిక్ రూపంలో మరోసారి స్టార్ హీరోలను టార్గెట్ చేస్తోంది షకీలా బయోపిక్ . తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు . ఒంటి నిండా బంగారు ఆభరణాలతో దర్శనం ఇచ్చింది రిచా చద్దా . అయితే ఎద భాగం లో గోల్డ్ మాత్రమే ఉంది ఇంకా ఎటువంటి ఆచ్చాదనా లేదు . అలాగే ఆ పోస్టర్ కు ఓ క్యాప్షన్ కూడా పెట్టారు . ఖాన్ గా పుట్టి ఇలాంటి సినిమాలు చేస్తావా ? అంటూ . శృంగార తార షకీలా కాబట్టి ఈ బయోపిక్ వస్తే మళ్ళీ కుర్రాళ్లకు పండగే పండగ అన్నమాట .

English Title: Adult star Shakeela biopic first look release