మహేష్, బన్నీ అయిపోయారు… ఇక ఎన్టీఆర్ తో!మహేష్, బన్నీ అయిపోయారు... ఇక ఎన్టీఆర్ తో!
మహేష్, బన్నీ అయిపోయారు… ఇక ఎన్టీఆర్ తో!

రష్మిక మందన్న హీరోయిన్ గా ఇప్పుడు సూపర్ సక్సెస్ఫుల్ కెరీర్ ను ఎంజాయ్ చేస్తోంది. ఛలో, గీతా గోవిందం సక్సెస్ లతో వచ్చిన ఊపును ఆమె పూర్తిగా క్యాష్ చేసుకుని ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్ గా ఎంపికైంది. సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆమెకు ఆఫర్లు కూడా పెరిగాయి. అయితే సరిలేరు రిలీజ్ కంటే ముందే రష్మికను అల్లు అర్జున్ – సుకుమార్ సినిమాకు సెలెక్ట్ చేసారు. ఇప్పుడు సరిలేరు సక్సెస్ కావడంతో రష్మిక లక్కీ ఛార్మ్ తమ సినిమాకు కూడా ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు. సుకుమార్ దర్శకుడు అంటే హీరోయిన్ పాత్ర అల్లాటప్పాగా ఏం ఉండదు.

తన కెరీర్ మొదటి నుండి, ఒకట్రెండు సినిమాల్లో తప్పితే హీరోయిన్ల కోసం స్పెషల్ క్యారెక్టర్ లు ఇస్తూ వస్తున్నాడు సుకుమార్. అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాలో కూడా హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తోంది. రా అండ్ రస్టిక్ గా సాగే ఈ సినిమాలో రష్మిక పాత్ర కట్టిపడేస్తుందని అంటున్నారు. స్వతహాగా మంచి నటి అయిన రష్మిక ఇలాంటి పాత్ర పడితే ఇక పెర్ఫార్మన్స్ విషయంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు.

ఇదిలా ఉంటే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం రష్మికకు టాలీవుడ్ లో మరో భారీ అవకాశం తలుపు తట్టినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కబోయే చిత్రంలో ఈమెనే హీరోయిన్ గా ఎంపిక చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టే పనిలో ఉన్నాడు. మరో రెండు నెలల్లో అది ఓ కొలిక్కి రావొచ్చు. అప్పటికి ఎన్టీఆర్ కూడా ఆర్ ఆర్ ఆర్ లో తన షూటింగ్ ను పూర్తి చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో మరో రెండు లేదా మూడు నెలల్లో ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రావొచ్చని తెలుస్తోంది. అప్పుడే రష్మిక ఈ సినిమాలో ఎంపికైందన్న అధికారిక సమాచారం కూడా ఇస్తారు.