అయితే, నెక్స్ట్ ఇయర్ “చిరు మామ” ఉంటుందా..?


After venky mama next chiru mama
After venky mama next chiru mama

మీరందరూ సన్ స్ట్రోక్ అనే పేరు వినే ఉంటారు. అంటే ఎండాకాలంలో మనుషులకు ఎండ వేడి వల్ల తగిలే వడ దెబ్బ కాదు. బాగా డబ్బు, పేరు సంపాందించిన కుటుంబాలలో, తరవాత వెచ్చే వారస రత్నాలు అటు సరిగ్గా చదువుకోకుండా, ఉద్యోగం, వ్యాపారం, వ్యవహారం, వ్యవసాయం చివరికి రాజకీయం; ఇలా ఏదీ కలిసిరాకపోతే సొంత పెత్తనాలు కట్టుకుని ఎంతో కొంత తగలేసి, చివరికి ఏమీ ఎరుగని పత్తి గింజల మాదిరి “కుల వృత్తి ని మించింది లేదు” అంటూ సొంత పనిలో సెటిల్ అయిపోయి, దాంట్లో కూడా మొదట్లో సరిగ్గా దేకలేక పోతే, అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ పెద్ద వాళ్ళు పడే బాధ ఉంటుందే , దానే సన్ స్ట్రోక్ అంటారు.

మిగిలిన వాటిలోఎలా ఉన్నా, సినిమా & రాజకీయం ఉండే ఈ సన్ స్ట్రోక్ లు తట్టుకోవడం కష్టం. రాజకీయం సంగతి తరువాత మాట్లాడుకుందాం. అయితే కొత్తగా ఇప్పుడు సన్ స్ట్రోక్ లతోపాటు “సన్ ఇన్ లా స్ట్రోక్” లు కూడా మొదలయ్యాయి. ఇవి వాటికంటే దారుణం. మన సన్ ని అయితే కోపంలో ఒక మాట అన్నా నడిచిపోతుంది. కానీ వీళ్ళని అలా కాదే. ఇండస్ట్రీ లో అలాంటి అల్లుడు స్ట్రోక్ ల గురించి ఆల్రెడీ వాటి బాధితుడు సినిమాటోగ్రాఫర్ చోట కె నాయుడు (సందీప్ కిషన్) గురించి చెప్పుకొచ్చాడు. ఇప్పుడు వాళ్ళ జాబితాలో విక్టరీ వెంకటేష్ చేరిపోయాడు. ఎంత పైకి ఎదో చెప్పుకొచ్చినా హిట్ కోసమే వెంకీ మామ దగ్గరికి అల్లుడు వచ్చాడనేది నిజం. మన తెలుగు హీరోలలో ఇంకా భవిష్యత్ లో ఇలాంటి అల్లుడు స్ట్రోక్ బాధితులు పెరిగే అవకాశం ఉంది. నటసింహం బాలయ్యబాబు కూడా తన అల్లుడు శ్రీ భరత్ కి తెరంగేట్రం విషయంలో ప్రామిస్ చేసాడని తెలుస్తోంది.

ఇక ఇండస్ట్రీ లో ఒక క్రికెట్ టీం తయారు చెయ్యడమే లక్ష్యంగా ఉన్న మెగా ఫ్యామిలీ కో కూడా అల్లుడు స్ట్రోక్ లు ఇంతకు మునుపే విజేత రూపంలో తగిలాయి. ఇక ఇవి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఉప్పెన అని ఇంకొక సినిమా కూడా ఉంది. మెగా ఫ్యామిలీ కి ముగ్గురు మామలు ఉండటం, వాళ్ళు కూడా ఫామ్ లో ఉండటంతో వచ్చే ఏడు “చిరు మామ” & “మెగా మామ” వచ్చే అవకాశం ఉంది, అప్పటిదాకా మనం మనకి నచ్చిన వాళ్ళని కమ్మగా, తియ్యగా, నోరారా “మోయ్య…..! అని పిలుచుకుంటూ ఆనందపడదాం.