ఒక్క హిట్టుతో ఛాన్స్ లే ఛాన్స్ లు


Naveen Polishetty
Naveen Polishetty

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రం సూపర్ హిట్ కావడంతో హీరో నవీన్ పోలిశెట్టి కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది . ఒక్క హిట్టుతో వరుసగా సినిమాలే సినిమాలు వస్తున్నాయి ఈ హీరోకు . వరుసగా వస్తున్న ఛాన్స్ లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు నవీన్ పోలిశెట్టి . ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సక్సెస్ తో మహానటి వంటి బ్లాక్ బస్టర్ తీసిన వైజయంతి , స్వప్న సినిమా బ్యానర్ లో సినిమా వచ్చింది .

అంతేనా మళ్ళీ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ నిర్మాత మళ్ళీ నవీన్ తోనే సినిమా చేయాలనీ చూస్తున్నారు . అలాగే మరో నలుగైదుగురు నిర్మాతలు కూడా పోటీ పడుతున్నారు నవీన్ తో సినిమా చేయడానికి . ఒక్క సక్సెస్ ఇన్ని సినిమాలను తెచ్చిపెడుతోంది . అసలు నవీన్ పోలిశెట్టి నటించిన మొదటి సినిమా కాదు ఈ ఏజెంట్ , ఇంతకుముందు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అనే చిత్రంలో చిన్న క్యారెక్టర్ చేసాడు నవీన్ అలాగే విజయ్ దేవరకొండ . కానీ అందులో హీరోలుగా నటించిన వాళ్ళు పక్కకు పోయారు విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయ్యాడు ,ఇప్పుడేమో నవీన్ పోలిశెట్టి హీరోగా సక్సెస్ కొట్టాడు .