10 కోట్ల క్లబ్ లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ


Agent Sai Srinivasa Atreya
Agent Sai Srinivasa Atreya

చిన్న చిత్రంగా వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మంచి విజయం సాధిస్తోంది . గత వారం విడుదలైన ఈ చిత్రం ఏకంగా పది కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది . నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఈ చిత్రానికి స్వరూప్ దర్శకత్వం వహించాడు . జూన్ 21 న విడుదలైన ఈ చిత్రం 9 రోజుల్లోనే 10 కోట్ల వసూళ్ల ని సాధించింది ప్రపంచ వ్యాప్తంగా .

డిటెక్టివ్ నేపథ్యంలో ఈమధ్య సరైన చిత్రాలు ఏవి రాకపోవడంతో పాటుగా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ కథ , కథనం అలాగే నవీన్ పోలిశెట్టి అభినయం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండటంతో మంచి విజయాన్ని కట్టబెట్టారు ప్రేక్షకులు . ఇక ఈ చిత్రానికి పలువురు సినీ ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు .