అజ్ఞాతవాసి గుర్తుల్ని చెరిపేసిన అల వైకుంఠపురములోఅజ్ఞాతవాసి గుర్తుల్ని చెరిపేసిన అల వైకుంఠపురములో
అజ్ఞాతవాసి గుర్తుల్ని చెరిపేసిన అల వైకుంఠపురములో

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిశారంటే ఎలాంటి సినిమా వస్తుందోనని ప్రేక్షకులు విపరీతమైన ఆసక్తితో ఉంటారు. అజ్ఞాతవాసి సినిమా ముందు వరకూ ఇదే పరిస్థితి. ఎందుకంటే ఈ ఇద్దరూ కలిసి జల్సా అంటూ హిట్ ఇస్తే, అత్తారింటికి దారేది చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఇలాంటి కాంబినేషన్ నుండి అజ్ఞాతవాసి వంటి సినిమా వస్తుందని ఎవరూ ఊహించలేదు. కనీసం పవన్ ఫ్యాన్స్ ను కూడా ఏ మాత్రం మెప్పించేలేకపోయిన సినిమాగా అజ్ఞాతవాసి నిలిచిపోతుంది. బయ్యర్లకు ఈ సినిమా దారుణమైన నష్టాలను మిగిల్చింది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, ఎస్ రాధాకృష్ణ ముగ్గురూ కలిసి బయ్యర్లకు 20 కోట్ల దాకా చెల్లించినా కానీ నష్టాలను పూడ్చలేకపోయారు.

అయితే అదే సంస్థను నమ్ముకున్న బయ్యర్లు ఇప్పుడు ఎట్టకేలకు జాక్ పాట్ కొట్టారు. హారిక అండ్ హాసిని సంస్థ అల వైకుంఠపురములో చిత్రాన్ని దాదాపుగా అజ్ఞాతవాసి బయ్యర్లకే కట్టబెట్టారు. ఒకట్రెండు ఏరియాలు అల్లు అరవింద్ వద్ద అట్టిపెట్టుకుని మిగతావి అజ్ఞాతవాసి బయ్యర్లకి అమ్మేసారు.

అల వైకుంఠపురములో బయ్యర్లకు పండగను తెచ్చింది. ఈ చిత్రాన్ని కొన్న వారందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అజ్ఞాతవాసి తర్వాత హారిక అండ్ హాసిని బ్యానర్ నే నమ్ముకున్నందుకు ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు పండగ చేసుకుంటున్నారు. తొలివారంలోనే బ్రేక్ ఈవెన్ కు చేరుకున్న అల వైకుంఠపురములో రెండో వారం నుండి లాభాలను అందుకుంది. విడుదలైన ప్రతి ఏరియాలో కనీసం 30 శాతం ఎక్కువ ప్రాఫిట్ ను అందుకుంది ఈ చిత్రం. అల వైకుంఠపురములో, అజ్ఞాతవాసి కొట్టిన దెబ్బను చాలా వరకూ చెరిపేసిందనే చెప్పొచ్చు.