ఆహా.. ఎంత మంచి ఛాన్స్ మిస్ అయింది!


ఆహా.. ఎంత మంచి ఛాన్స్ మిస్ అయింది!
ఆహా.. ఎంత మంచి ఛాన్స్ మిస్ అయింది!

అల్లు అరవింద్ నిర్మాతగా అల వైకుంఠపురములో చిత్రంతో బాగానే ఆర్జించాడు. ఈ సినిమాకు సెపరేట్ గా పెట్టుబడి పెట్టకపోయినా లాభాలతోనే ఈ చిత్రం ద్వారా దాదాపుగా 20 కోట్ల దాకా వెనకేసున్నాడని అంటున్నారు. అయితే ఈ లాభం సంగతి ఓకే కానీ అల్లు అరవింద్ ఈ సినిమా ద్వారా ఒక మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడని మాట్లాడుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే నిర్మాతగా మంచి పేరు సంపాదించుకున్న అల్లు అరవింద్ ఇటీవలే డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ ఆహాను లాంచ్ చేసిన విషయం తెల్సిందే.

లాంచ్ కూడా చాలా లో ప్రొఫైల్ లో చేసారు. ఇందులో అర్జున్ సురవరం, ఖైదీ తప్ప పెద్దగా చెప్పుకునే సినిమాలు కూడా లేవు. త్వరలో చూసి చూడంగానే ఇందులోకి వస్తుంది. అయితే డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ సక్సెస్ అవ్వాలంటే ఎంత కంటెంట్ వీలయితే అంత యాప్ లో అందుబాటులో ఉండాలి. అప్పుడే అదే సక్సెస్ అవుతుంది. ప్రైమ్ విషయంలో జరిగింది అదే. ఎప్పటికప్పుడు సినిమాలను దించుతూ వెళ్ళింది ఆ సంస్థ.

అయితే ఆహా యాప్ ను లాంచ్ చేస్తున్నప్పుడు అందులోనే అల వైకుంఠపురములో స్ట్రీమ్ అయ్యేలా చూసుకుని ఉంటే అది యాప్ కు ఎంతో ప్లస్ అయ్యేది కదా అని విశ్లేషిస్తున్నారు. ఎన్నో కోట్లు పెడితే కానీ రాని పబ్లిసిటీ ఆహా యాప్ కు అల వైకుంఠపురములో సినిమా ద్వారా వచ్చేది. ఈ చిత్రంపై భారీ లాభాలు ఆర్జించారు సరే కానీ ఈ ఒక్క మూవ్ కూడా చేసి ఉంటే అటు యాప్ కు కూడా చాలా ప్లస్ అయ్యేది అని అనుకుంటున్నారు. అయితే అల్లు అరవింద్ మాస్టర్ మైండ్. ఏదొక లాభం లేకుండా ఈ పని చేసి ఉండడుకదా!