బ్లాక్ బ‌స్ట‌ర్ ఆగ‌స్టుకు రెడీ అయిన `ఆహా`! 

Aha ott ready for August hungama
Aha ott ready for August hungama

క‌రోనా కార‌ణంగా ఓటీటీల‌కు ప్ర‌స్తుతం డిమాండ్ ఏర్ప‌డింది. వినోదం కోసం చాలా మంది ఓటీటీల‌ని ఆశ్ర‌యిస్తున్నారు. తెలుగులో కొత్త‌గా మొద‌లైన ఓటీటీ యాప్ `ఆహా` ఇప్పుడు తెలుగు కంటెంట్‌కు ఇప్పుడు ముందు వ‌రుస‌లో నిలుస్తోంది. ఈ యాప్‌కి రోజు రోజుకీ వ్యూవ‌ర్ షిప్ పెరిగిపోతుండ‌టంతో ప్ర‌ముఖ నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు త‌మ చిత్రాల‌ని ఆహాలో రిలీజ్ చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. ఈ నెల‌లో ఆహా నుంచి 10 చిత్రాలు అందుబాటులోకి రానున్నాయి.

ఈ సంద‌ర్భంగా క్రేజీ యాంక‌ర్ సుమ‌, ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఫేస్ బుక్ లైవ్‌లో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు.ఈ సంద‌ర్భంగా దిల్ రాజు `బుచ్చినాయుడు కండ్రీగ‌` చిత్రాన్ని ప్ర‌క‌టించారు.ఇది ఆగ‌స్టు 21న ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు వినోదాన్ని కోరుకునే ప్రేక్ష‌కులు ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని చూడొచ్చు. దీనితో పాటు పాపుల‌ర్ క‌మెడియ‌న్ వైవా హ‌ర్ష స‌రికొత్త రియాలిటి షో ` త‌మాషా విత్ హ‌ర్ష‌`ని ప్ర‌క‌టించారు. ఇది ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది.

ఇక యాంక‌ర్ సుమ కూడా `ఆల్ ఈజ్ వెల్‌` అనే షోని ప్ర‌క‌టించింది. ఆగ‌స్టు 14 నుంచి ప్ర‌సారం కానుంది. ఇవే కాకుండా మ‌రికొన్ని మ‌ల‌యాళ తెలుగు అనువాద చిత్రాలు కూడా స్ట్రీమింగ్ కానున్నాయి. అందులో `ఫోరెన్సిక్ శ‌క్తి`, ట్రాన్స్  చిత్రాలు కూడా వున్నాయి.