`క్రాక్‌` దూకుడుకి ఆహా బ్రేక్ వేస్తోందా?


`క్రాక్‌` దూకుడుకి ఆహా బ్రేక్ వేస్తోందా?
`క్రాక్‌` దూకుడుకి ఆహా బ్రేక్ వేస్తోందా?

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన హైవోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `క్రాక్‌`. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స‌ర‌స్వ‌తీ ఫిలింస్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై ఠాగూర్ మ‌ధు నిర్మించారు. ఈ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న విడుద‌లైన ఈ చిత్రం అనూహ్య విజ‌యాన్ని సాధించింది. తొలి రోజు ఆర్థిక ప‌ర‌మైన లావాదేవీల కార‌ణంగా ఫ‌స్ట్ షోతో మొద‌లైన ఈ మూవీ తొలి షోతో మంచి టాక్‌ని సొంతం చేసుకుని సంక్రాంతి చిత్రాల్లో విజేత‌గా నిలిచింది.

రిలీజ్ వారం త‌రువాత థియేట‌ర్లు త‌గ్గించ‌డంతో ఈ చిత్రాన్ని నైజాంలో పంపిణీ చేసిన వ‌రంగ‌ల్ శ్రీ‌ను ఇష్యూని పెద్ద‌ది చేయ‌డంతో చివ‌రికి మ‌ళ్లీ ఈ మూవీకి థియేట‌ర్లు పెంచారు. స్టిల్ క‌లెక్ష‌న్స్ స్ట‌డీగా వున్నాయి. మ‌రిన్ని థియేట‌ర్స్ పెంచేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో `క్రాక్‌` దూకుడుకి `ఆహా` ఓటీటీ క‌ళ్లెం వేస్తోంది. ఈ చిత్ర డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్‌ని ఆహా ఓటీటీ సొంతం చేసుకుంది.

థియేట‌ర్ల‌లో మాంచి ఊపులో క‌లెక్ష‌న్‌ల‌ని రాబ‌డుతున్న ఈ చిత్రాన్ని 2 నెల 26 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్న‌ట్టు తాజాగా ప్ర‌క‌టించారు. దీంతో ఆహా నిర్ణ‌యం `క్రాక్‌` థియేట‌ర్ క‌లెక్ష‌న్‌ల‌పై ప్ర‌భావాన్ని చూపించే అవ‌కాశం వుందని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఓ సినిమా థియేటర్ల‌లో మంచి టాక్‌తో ర‌న్న‌వుతున్న నేప‌థ్యంలో ఆ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అనే వాద‌న వినిపిస్తోంది.