గేమ్ ప్లాన్ మార్చిన `ఆహా` ఓటీటీ!


aha ready new game plan
aha ready new game plan

డిజిట‌ల్ వ‌ర‌ల్డ్‌లోకి కొత్త‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆహా డిజిట‌ల్ ప్లాట్ పామ్‌. తొలి నాళ్ల‌లో హేమా హేమీలైన నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ , జీ5, మ్యాక్స్ ప్లేయ‌ర్‌.. ఆల్ట్ బాలాజీ వంటి డిజిట‌ల్ ఫ్లాట్ పామ్‌ల‌తో ఎలా పోటీప‌డాలో అర్థం అయ్యేది కాదు. దీంతో లోక‌ల్ కంటెంట్‌పై దృష్టిపెట్టినా పెద్ద‌గా ఫ‌లితం లేకుండా పోయింది. దీంతో కొత్త గేమ్ ప్లాన్‌ని రెడీ చేసింది.

మిగ‌తా ఓటీటీల‌కు తాము ఎందులోనూ త‌క్కువ కాద‌ని నిరూపించే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇటీవ‌ల ఆహాలో విడుద‌లైన చిత్రం `క‌ల‌ర్ ఫొటో`. సుహాస్‌, చాందిని చౌద‌రి జంట‌గా న‌టించిన ఈ మూవీ విమ‌‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు సెల‌బ్రిటీల మన్న‌న‌లూ అందుకుంటోంది. ఈ మూవీకి భారీ స్థాయిలో వ్యూస్ రావ‌డంతో ఆహా తాజాగా గేమ్ ప్లాన్‌ని మార్చేసింది.

కొత్త‌గా వీవ‌ర్స్‌ని ఎట్రాక్ట్ చేయడం కోసం కొత్త కంటెంట్‌ని రంగంలోకి దింపేస్తోంది. న‌వంబ‌ర్ నెల‌లో వ‌రుస‌గా కొత్త ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని అందించ‌బోతోంది. స‌మంత – వెన్నెల కిషోర్ టాక్  షో సామ్ జామ్‌, వైవా హ‌ర్షా `త‌మాషా విత్  హ‌ర్షా` కామెడీ షో, పాయ‌ల్ రాజ్‌పుత్ `అన‌గ‌న‌గ ఓ అతిథి`, పున‌ర్న‌వి భూపాలం `క‌మిట్ మెంట‌ల్‌`, సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ `మ‌న వింద గాథ వినుమ‌` వంటి ఇంట్రెస్టింగ్ షోల‌తో ఆడియ‌న్స్‌ని ఫుల్ చిల్ చేయ‌బోతోంది.