దేవ‌ర‌కొండ‌ను ఆన్ స్క్రీన్ కిస్ చేయాల‌నుంద‌ట‌!


దేవ‌ర‌కొండ‌ను ఆన్ స్క్రీన్ కిస్ చేయాల‌నుంద‌ట‌!
దేవ‌ర‌కొండ‌ను ఆన్ స్క్రీన్ కిస్ చేయాల‌నుంద‌ట‌!

లాక్‌డౌన్ స‌మ‌యంలో టాలీవుడ్‌లో ప్ర‌ధానంగా వినిపించిన పేరు `ఆహా`. డిజిట‌ల్ దిగ్గ‌జాల‌కు పోటీగా ద‌క్షిణాదిలో మొద‌లైన మొట్ట‌మొద‌టి ఓటీటీ `ఆహా`. దీన్ని పాపుల‌ర్ ఓటీటీల స‌ర‌స‌న నిలాపాల‌ని ఏస్ ప్రొడ్యూస‌ర్‌.. మాస్ట‌ర్‌మైండ్…  స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తున్నారు. ఉత్త‌రాది ఓటీటీల‌కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో అంత‌కు మించి చిత్రాల‌ని, ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్‌ని అందిస్తూ మిగ‌తా ఓటీటీల‌కి `ఆహా`కి ఓ ప్ర‌త్యేక‌త వుంద‌ని నిరూపిస్తున్నారు.

దీంతో `ఆహా` ఓటీటీకి రోజు రోజుకీ స‌బ్ ‌స్క్రైబ‌ర్ల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది. దీన్ని మ‌రింత‌గా పెంచ‌డం కోసం అల్లు అర‌వింద్ టీమ్ కొత్త త‌ర‌హా టాక్ షోల‌ని డిజైన్ చేసిన విష‌యం తెలిసిందే. ఇందులో ముఖ్య‌మైన‌ది స్టార్ హీరోయిన్ స‌మంత హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న `సామ్ – జామ్‌`. ఈ షో `ఆహా`లో సూప‌ర్ హిట్‌. టాలీవుడ్ సెన్సేష‌న్‌.. రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ మార్వలెస్ ఎపిసోడ్‌తో ఈ టాక్ షో స్ట్రీమింగ్ ప్రారంభ‌మైంది. ఇందులో వ‌చ్చే సెల‌బ్రిటీల ఇంట‌ర్వ్యూలు ప్ర‌ధాన హైలైట్‌గా నిలుస్తున్నాయి.

తాజాగా మిల్క్ బ్యూటీ త‌మ‌న్నాకు సంబంధించిన ఎపిసోడ్ ఈ శుక్ర‌వారం (11-12-2020)న `ఆహా`లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం సంద‌డి చేస్తోంది. ముఖ్యంగా యూత్‌ని భ‌లే ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ టాక్ షోలో స‌మంత అడిగిన రాపిడ్ ఫైర్ ప్ర‌శ్న‌ల‌కు త‌మ‌న్నా అంతే స్పీడుగా స‌మాధాన‌లు చెప్పి షాకిచ్చింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని ఆన్ స్క్రీన్ కిస్ చేయాల‌నుంద‌ని చెప్పేసింది. నో కిస్సింగ్ సీన్ ఆన్ స్క్రీన్ రూల్‌ని బ్రేక్ చేస్తే మాత్రం తాను విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని ఆన్ స్క్రీన్ కిస్ చేయాల‌నుకుంటున్నాన‌ని ఓపెన్ అయ్యింది.

ఇక మ‌ధ్య‌లో అఖిల్ టాపిక్ వ‌చ్చేస‌రికి ..త‌ను కొంచెం యంగ్ అయిపోయాడ‌ని సామ్ చెప్పుకొచ్చింది. వెంట‌నే త‌మ‌న్నా అందుకుని ఏజ్‌కీ ల‌వ్‌కీ సంబంధం లేదంది. కావాలంటే అఖిల్‌తో మీటింగ్ అరెంజ్ చేస్తాన‌ని.. అఖిల్ ఫాద‌ర్‌తో కూడా మాట్లాడ‌తావా అంటూ సామ్ ఆట‌ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేసింది. ఈ ప్రోమో వైర‌ల్‌గా ఆక‌ట్టుకుంటోంది. స‌మంత‌.. త‌మ‌న్నాల మ‌ధ్య ఏ స్థాయిలో చిట్ చాట్ జ‌రిగింద‌న్న‌ది తెలియాలంటే ఈ రోజు స్ట్రీమింగ్ అవుతున్న `సామ్ – జామ్‌` త‌మ‌న్నా ఎపిసోడ్ చూడాల్సిందే.