ఆమె బయోపిక్ లో నిజాలు చెబితే సంచలనమే


Aishwarya rai bachhan opens about her biopic

బయోపిక్ లంటూ తీస్తే అసలైన నిజాలు తీయాలి అంతేకాని వాస్తవాలను దాచిపెడుతూ తీస్తే ప్రయోజనం ఏంటి ? నా బయోపిక్ తీస్తే తప్పకుండా అన్ని నిజాలే చెబుతానని , వాస్తవాలు తెలిసేలా ఉంటుందని తప్పకుండా నా బయోపిక్ గొప్ప కథ అవుతుందని అంటోంది అందాల భామ ఐశ్వర్యా రాయ్ . బాలీవుడ్ లో అలాగే టాలీవుడ్ లో బయోపిక్ ల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే . అయితే బయోపిక్ లంటూ చాలా సినిమాలు వస్తున్నాయి కానీ వాటిలో అసలైన వాస్తవాలు దాస్తున్నారని ఆరోపణలు పెద్దఎత్తున వస్తున్న దరిమిలా ఐశ్వర్యా రాయ్ స్పందించింది తన బయోపిక్ పైన .

నా జీవితం తప్పకుండా గొప్ప కథ అవుతుంది ,బయోపిక్ కోసం నిజాలు వెల్లడించడానికి నేను సిద్ధం అయితే అది ఇప్పుడే కాదు అని సెలవిచ్చింది . అంటే అమ్మడు బయోపిక్ కు సిద్దమే అయితే మాజీ లవర్స్ అయిన సల్మాన్ ఖాన్ , వివేక్ ఒబెరాయ్ ల ప్రస్తావన ఎలా ఉంటుందో చూడాలి . వాళ్ళ గురించి ఈ భామ ఏం చెబుతుంది ? ఎవరి తప్పిదం వల్ల సల్మాన్ తో ప్రేమ బ్రేకప్ అయ్యింది , ఎవరి తప్పిదం వల్ల వివేక్ ఒబెరాయ్ తో జరుగుతుంది అనుకున్న నిశ్చితార్థం రద్దయ్యింది ? ఎలా అభిషేక్ తో పెళ్లి అయ్యింది అన్నది వెలుగులోకి వస్తుందా చూడాలి .

English Title: Aishwarya rai bachhan opens about her biopic