ఐశ్వర్య రాయ్ కి విడాకులు


Aishwarya rai divorce news goes viral

ఐశ్వర్య రాయ్ కు విడాకులు అనగానే హీరోయిన్ ఐశ్వర్య రాయ్ అని అనుకుంటున్నారా ? కాదు …… కాదు సినిమా హీరోయిన్ కాదు రాజకీయ నాయకుడి కోడలు ఐశ్వర్య రాయ్ కాకపోతే ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో ఆ కన్ఫ్యూజ్ అంతే ! వివరాలలోకి వెళితే ……. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లి ఐశ్వర్య రాయ్ తో జరిగింది . ఢిల్లీ లో ఎంతగానో లైఫ్ ని ఎంజాయ్ చేసిన ఐశ్యర్య రాయ్ కి బీహార్ లో ఉండే లాలూ తనయుడికి లైఫ్ స్టైల్ లో చాలా తేడాలు ఉన్నాయి దాంతో పెళ్ళై ఆరునెలల కాలంలోనే విడిపోవాలని నిర్ణయించుకున్నారు . పెళ్లి అయి ఆరునెలలు కాగా అందులో రెండు నెలలుగా వేరుగా ఉంటున్నారు .

ఇద్దరి అభిప్రాయాల్లో అలాగే లైఫ్ స్టైల్ లో తేడాలు ఉండటంతో కలిసి ఉండి గొడవలు పడేకంటే విడాకులు తీసుకుంటేనే మేలు అని ఓ నిర్ణయానికి వచ్చి విడాకుల కోసం కోర్టులో అప్లై చేసారు . అసలు ఐశ్వర్య రాయ్ తో పెళ్లి వద్దని మొత్తుకున్నాడట ! కానీ లాలూ కానీ రబ్రీ దేవి కానీ కొడుకు మాట వినకుండా బలవంతంగా పెళ్లి చేశారట ! దాంతో పెళ్లి అయిన ఆరునెలలకె పెళ్లి పెటాకులు అయ్యింది . బలవంతంగా పెళ్లి చేసారు అందుకే విడాకులు తీసుకుంటున్నాను అంటూ మీడియా ముందుకు వచ్చి చెబుతున్నాడు తేజ్ ప్రతాప్ యాదవ్ .

English Title: Aishwarya rai divorce news goes viral