ఐశ్య‌ర్యారాయ్ వేశ్య బ‌యేపిక్‌లోనా?


ఐశ్య‌ర్యారాయ్ వేశ్య బ‌యేపిక్‌లోనా?
ఐశ్య‌ర్యారాయ్ వేశ్య బ‌యేపిక్‌లోనా?

ప్రస్తుతం ఏ ఇండ‌స్ట్రీలో చూసినా బ‌యోపిక్‌ల హ‌వా న‌డుస్తోంది. బాలీవుడ్, కోటీవుడ్‌, టాలీవుడ్, మాలీవుడ్ అని తేడా లేకుండా వ‌రుస బ‌యోపిక్‌లు తెరపైకొస్తున్నాయి. ఈ సినిమాలు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తుండ‌టం, బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని సాధిస్తుండ‌టంతో మేక‌ర్స్ బ‌యోపిక్‌ల‌పై అమితాస‌క్తిని చూపిస్తున్నారు. తాజాగా ఓ బెంగాళీ రంగ‌స్థ‌ల న‌టి బినోదిని దాసి జీవిత క‌థ తెర‌పైకి తీసుకురాబోతున్నారు.

19వ శ‌తాబ్ధంలో బెంగాళీ న‌ట‌క రంగంపై త‌న‌దైన న‌ట‌న‌తో చెర‌గ‌ని ముద్ర‌వేశారు న‌టి బినోదిన దాసి. వివిధ నాట‌కాల్లో 80కి పైగా పాత్ర‌ల్లో రాణించి రంగ‌స్థ‌ల ప్రేక్ష‌కుల హృద‌యాల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. వేశ్య వృత్తి నుంచి రంగ‌స్థ‌ల క‌ళాకారిణిగా మారి గుర్తింపును సొంతం చేసుకున్న ఆమె ఈవిత క‌థ‌ని తెర‌పైకి తీసుకురావాల‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ స‌ర్కార్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవ‌ల ఈ క‌థ‌ని దీపికా ప‌దుకోన్‌కు వినిపించార‌ట‌. క‌థ బాగున్నా బ‌రువైన పాత్ర కావ‌డం, ఇటీవ‌లే ప‌ద్మావ‌త్‌, ఛ‌పాక్ వంటి సీరియ‌స్ చిత్రాల్లో న‌టించ‌డంతో ఈ కథ‌లో న‌టించ‌డానికి దీపిక సుముఖ‌త‌ను వ్య‌క్తం చేయ‌లేద‌ట‌.

దాంతో ద‌ర్శ‌కుడు అదే క‌థ‌ని ఐశ్వ‌ర్యారాయ్‌కి వినిపించార‌ట‌. క‌థ న‌చ్చ‌డంతో ఐష్ వెంట‌నే ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ స‌ర్కార్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. బినోదిని దాసి ఆటోబ‌యోగ్ర‌ఫీ `అమ‌ర్ క‌థ‌` ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకురాబోతున్నార‌ట‌. దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ న్యూస్‌ని చిత్ర వ‌ర్గాలు త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.