నా డ్రీమ్ ప్రాజెక్ట్ వదులుకున్నందుకు భాధగా వుంది.. ఐశ్వర్య రాజేష్

Aishwarya Rajesh
Aishwarya Rajesh

యూనివర్సెల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా గ్రేట్ శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై రూపొందుతున్నచిత్రం భారతీయుడు-2.

ఈ చిత్రంలో సిద్దార్థ ఓ ముఖ్య భూమిక పోషిస్తున్నారు.. అలాగే కమల్ హాసన్‌ సరసన కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఐశ్వర్య రాజేష్‌ని మరో కీలక పాత్ర కి ఎంపిక చేసింది చిత్ర యూనిట్. అయితే ఉన్నట్టుండి ఈ సినిమా నుంచి తప్పుకుంది ఐశ్వర్య.

అయితే భారతీయుడు 2 చిత్ర యూనిట్తో సంప్రదింపులు చేసి.. పరస్పర అంగీకారంతోనే ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం జరిగిందని ఆమె తెలిపింది.

ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్ వాదులు కోవడం చాలా బాధగా ఉందని ఆవేదన చెందింది. కమల్‌ సర్‌, శంకర్‌ సర్‌తో కలిసి పని చేయడమంటే అది అరుదైన అవకాశమని, నాకు ఇది డ్రీమ్‌ ప్రాజెక్టు కానీ మిస్సయిందని ఆమె తెలిపింది. దీనిపై ఇటీవల కౌసల్య కృష్ణమూర్తి ప్రెస్ మీట్ లో అడగ్గా.. ఇతర సినిమాలతో బిజీగా ఉండటం, డేట్స్‌ కుదరకపోవడం కారణంగానే నేను కమల్‌ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని ఐశ్వర్య చెప్పింది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ తన కాల్షీట్లతో బిజీగా ఉంది. ఆమె వివిధ భాషల్లో 14 సినిమాలకు సైన్ చేసింది..